హైదరాబాద్

నగర పబ్‌ల్లో గం‘జాయ్’..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: హైదరాబాద్ పబ్‌ల్లో యువత గంజాయితో ఎంజాయ్ చేస్తోంది. పోలీస్ తనిఖీల్లో నగరంలో ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా సాగుతోన్న గంజాయి దందా ఇతర రాష్ట్రాలకూ పాకుతోంది. హైదరాబాద్‌లోని పబ్‌లలో ప్రతి సంవత్సరం 5వేల కేజీల నుంచి 6వేల కేజీల వరకు గంజాయి సరఫరా జరుగుతోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారి అప్పు కుటాన్ తెలిపారు. గంజాయి కేజీ రూ. 2వేల నుంచి 5వేల వరకు విక్రయిస్తున్నారని, 200గ్రాముల గంజాయిని రూ. 5వందలకు కాలేజి విద్యార్థులు, యువకులకు విక్రయిస్తున్నట్టు ఎన్‌సిబి గుర్తించింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ప్రతి యేటా 12వేల నుంచి 13వేల కిలోల గంజాయిని ముంబయి, గోవా, ఢిల్లీ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్టు ఎన్‌సిబి గుర్తించింది. గత జూలై మాసాంతంలో హయత్‌నగర్‌లోని పలు ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన హయత్‌నగర్ ఇనె్స్పక్టర్ నరేందర్‌గౌడ్ రూ.2కోట్లు విలువ చేసే 2,200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. అదేవిధంగా గత జూన్ నెలలోనే రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో 1400 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తెలిపారు. సికిందరాబాద్, కాజీపేట, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో సుమారు 647 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు రైల్వే ఇన్‌స్పెక్టర్ ఏ ఆంజనేయులు తెలిపారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు దిగుమతి అవుతోన్న 300 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎన్‌సిబి అధికారులు తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలకు అవుతోన్న ఎగుమతి కంటే హైదరాబాద్, ముంబయికే ఎక్కువగా దిగుమతి అవుతోందని, హైదరాబాద్‌లో గంజాయి వినియోగం అధికంగా ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలిపారు.

ఆటో ఢీకొని
బాలుడి మృతి

హైదరాబాద్, చాదర్‌ఘాట్, డిసెంబర్ 25: ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరు సంవత్సరాల బాలుడు రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో అక్కడి కక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చాదర్‌ఘాట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చాదర్‌ఘాట్ ఇన్స్‌పెక్టర్ సత్తయ్య కథనం ప్రకారం..కోఠి నుండి మలక్‌పేట్ వైపు వస్తున్న ఆటో(ఎపి22ఎక్స్ 0417) ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చాదర్‌ఘాట్ పోలీస్టేషన్ వెనుక బస్తీ కమల్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సయ్యద్ కుమారుడు ముఖీన్(6)ను ఢీ కొట్టింది. ముఖీన్ తన స్నేహితులతో కలిసి అడుకుంటూ ఇంటికి తిరిగి వస్తుండగా ఛాదర్‌ఘాట్ బ్రిడ్జిపై వచ్చే సరికి వేగంగా వచ్చిన ఆటో బాలుడిని ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముఖీన్ తలకు బలమైన తీవ్రగాయాలు తగిలాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం బాలుడుని స్థానిక లైఫ్‌లైన్ ఆసుపత్రికి తీసుకేళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆటోను సీజ్ చేసి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తోటి స్నేహితులతో కలిసి ఆదివారం ఆడుకుంటానని బయటకి వెళ్లిన చిన్నారి మృతి చెందడంతో కమల్‌నగర్‌లో విషాధఛాయాలు అలముకున్నాయి. ముఖీన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.