హైదరాబాద్

హవాలా దందా దివాలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, డిసెంబర్ 25: పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, లావాదేవీలపై నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాలలో కరెన్సీ కొరత నుంచి ఇంకా తేరుకోకున్నా..నగదు రహిత లావాదేవీల్లో ముందంజలో ఉన్నా ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోందని భావిస్తున్నారు. ఏ కార్యం నిర్వహించాలన్నా కరెన్సీ కావల్సిందే. కానీ ప్రభుత్వం కళ్లు కప్పి, పన్నులు, రాయితీల నుండి తప్పించు కోవాలంటే ఎన్నో కష్టాలు. అలాంటి వాటి నుండి తప్పించటానికే పుట్టుకొచ్చిన హవాలా దందా హైదరాబాద్ నగరంలో చాపకింద నీరులా విస్తరించి..ఏకంగా సమాంతర ఆర్ధిక వ్యవస్థ నిర్వహంచే స్థాయికి ఎదిగారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగరంలో హవాలా దందా దివాలా తీసింది. హవాలా వ్యాపారస్థుల కోటలు కుప్పకూలాయి. ఐటి, ఇతరత్రా ప్రభుత్వ ఆధీకృత పన్నులనుండి తప్పించుకుని దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఎన్ని లక్షలైనా, కోట్లైనా రోజు, సమయం, ఎండా, వానా తేడా లేకుండా కనుసన్నల్లో ట్రాన్స్‌ఫర్ చేసే హవాలా వ్యాపారస్థులకు నగరంలో కొదవ లేదన్నది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా రోజుకు కోట్లలో టర్నోవర్ ఉండే కొందరు అక్రమ బంగారు వ్యాపారస్థులు, దుస్తుల డీలర్లు, స్టాక్ ఎక్సేంజ్, తదితర వ్యాపారులరు హవాలా దందా వ్యాపారస్థులను ఆశ్రయిస్తుంటారు.అలాగే పాతబస్తీతో పాటు హవాలా వ్యాపార కేంద్రాలైన బేగంబజార్, చార్‌కమాన్ గుల్జార్‌హౌజ్, సికింద్రాబాద్ పాట్‌మార్కెట్, జనరల్‌బజార్, ఆబిడ్స్, తదితర హోల్‌సేల్ మార్కెట్లలో రోజుకు వందల కోట్ల లావాదేవీలు చేతులు మారుతుంటాయి. ఇటీవల ఒక బంగారు వ్యాపారి పెద్దఎత్తున మోసానికి పాల్పడి రాజస్థాన్ పరారుకావడం గమనార్హం. ఉత్తర భారతదేశానికి చెందిన కొందరు మార్వాడీ, గుజరాతీ, జైన్ తదితర సామాజికవర్గం వారు హవాలా వ్యాపార నిర్వహణలో సిద్ధహస్తులు. పండుగలు పబ్బాలకు మాత్రం దాదాపు పది పదిహేను రోజులు సొంతూర్లకు వెళ్లే వీరు ఈసారి మాత్రం నోట్ల రద్దు తర్వాత పండుగలకు వెళ్లిన వారు ఇంకా రావటం లేదని తెలుస్తోంది. కరెన్సీ కట కటతో అన్నివర్గాల వారికి కార్యకలాపాలు స్తంభించిపోవటంతో పెద్ద మొత్తంలో డబ్బులు చెలామణి చేసే పరిస్థితి లేదు. రోజుకో రూలు ఆర్‌బిఐ విధిస్తుండటంతో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ..అచ్చా దిన్ వచ్చే వరకు వేచిచూస్తున్నారు. ఓవైపు పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రం, నగరంలో కూడా క్రైమ్ రేటింగ్ కూడా తగ్గింది. ఈనేపథ్యంలో తాత్కాలికంగా గట్టెక్కడానికి మాత్రం కమీషన్ దందాకు విరామం ఇచ్చారు. నల్ల డబ్బును తెల్లగా మారుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. పెద్దనోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో హవాలా నిర్వాహకులు ఆ పనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నట్టు తెలుస్తోంది.