హైదరాబాద్

వికారాబాద్- కృష్ణ మధ్య రైల్వే లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: వికారాబాద్ నుండి కృష్ణ వరకూ 122 కిలోమీటర్ల పొడవైన బ్రాడ్ గేజ్ రైలు నిర్మాణానికి కేంద్రం యోచిస్తోందని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. కొత్త రైల్వే లైను కోసం ప్రాధమిక ఇంజనీరింగ్- ట్రాఫిక్ సర్వేను కూడా రైల్వే బోర్డు 2011 జూన్ 24న ఆమోదించిందని చెప్పారు. సవివర ప్రాజెక్టు నివేదికను (డిపిఆర్)ను రైల్వే శాఖ, రాష్ట్రప్రభుత్వం కలిసి కేంద్రానికి సమర్పించాల్సి ఉందని ఆయన చెప్పారు. తమ్మన్నగారి రామమోహనరెడ్డి, రేవంత్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు సోమవారం నాడు శాసనసభలో మంత్రి మహేందర్‌రెడ్డి సమాధానం చెప్పారు. కొత్త రైల్వే లైన్ వ్యయంలో 50 శాతం ఖర్చు భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
8.68 లక్షల మందికి డిజిటల్ శిక్షణ
ప్రభుత్వ ఆధీనంలోని 3472 స్కూళ్లలో 8.68 లక్షల మంది డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఉన్నత పాఠశాల విద్యార్ధులకు డిజిటల్ విధానంలో నేర్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓడితెల సతీష్‌కుమార్, బిగాల గణేష్, గాదారి కిషోర్ కుమార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం నాడు శాసనసభలో సమాధానం చెప్పారు. 2016 నవంబర్ 16న డిజిటల్ తరగతులు ప్రారంభించామని, వచ్చే విద్యాసంవత్సరం నుండి ఉర్దూ పాఠశాలలతో సహా మొత్తం 5400 స్కూళ్లలో డిజిటల్ తరగతులు మొదలవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని, స్కూళ్ల నిర్వహణకు ప్రత్యేక నిధిని కేటాయించామని తెలిపారు. యుపి స్కూళ్లకు 50వేలు, హైస్కూళ్లకు లక్ష రూపాయిల వరకూ ప్రత్యేక నిధి కేటాయించామని, ఈ నిధులతో ఇద్దరు వర్కర్లను నియమించుకునేందుకు వీలుకల్పించామని అన్నారు.