హైదరాబాద్

మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే మహానగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రోరైలు ప్రాజెక్టు మరో అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాకపోవటం, నిర్ణీత గడువులో ముగియపోవటానికి ప్రధాన కారణమైన స్థల సేకరణ ప్రక్రియలో మెట్రో అధికారులు మరో మైలు రాయి దాటారు. ముఖ్యంగా మూడు కారిడార్లలోను చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తులకు సంబంధించిన స్థలాలను ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం మెట్రోరైలు అధికారులు వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా సికిందరాబాద్ పాండురంగస్వామి దేవాలయం ముందు భాగంలో ఉన్న గుత్తికొండ లాడ్జి స్థలాన్ని సేకరించారు. ఇక్కడ కారిడార్ 3లో భాగంగా సికిందరాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు నందకుమార్ అనే వ్యక్తికి చెందిన పద్మహంస కాంప్లెక్సు ఇరువైపులా నిర్మాణాలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంట్రీక్లబ్ స్థలంలో కొంత, అలాగే నవాబ్‌యార్ జంగ్‌కు చెందిన స్థలం, అలాగే లైఫ్ స్టైల్, మేబాజ్, వైట్‌హౌజ్‌ల ముందున్న స్థలంతో పాటు పోస్ట్ఫాసు పై భాగాలను కూల్చివేసి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట, రెహ్మత్ కాంప్లెక్సు, యూసుఫ్‌గూడ, మధురానగర్, కృష్ణానగర్ రూట్‌లో రోడ్డుకిరువైపులా స్థల సేకరణ పూర్తి చేశారు. అలాగే రోడ్‌నెం. 5 జూబ్లీహిల్స్, రాంరెడ్డి స్థలం , జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మ టెంపుల్, మాదాపూర్, దుర్గం చెరువు, రోడ్ నెం. 36ల్లోని పలు ఆస్తులకు చెందిన స్థలాలను సేకరించారు. వీటితో పాటు ఆర్వోబిలు నిర్మించనున్న చిలకలగూడ, ఆలుగడ్డబావి, ఒలిఫెంటా బ్రిడ్జి, బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట ప్రాంతాల్లో అడ్డంకులన్నీ తొలగినట్లు అధికారులు తెలిపారు.
కారిడార్ 2లో..
సికిందరాబాద్ జెబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న కారిడార్ 2 పరిధిలోకి వచ్చే పలు ప్రాంతాల్లో కూడా పెండింగ్‌లో ఉన్న ఆస్తుల నుంచి అధికారులు స్థలాలను సేకరించారు. జెబిఎస్, ప్యారేడ్ గ్రౌండ్స్, బేగంపేట ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించటంతో పాటు అమీర్‌పేట, పరెడ్‌గ్రౌండ్స్, ఎంజిబిఎస్‌ల వద్ద ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ల పనులు ముమ్మరమయ్యాయి. సికందరాబాద్ బోయిగూడ సమీపంలోని ఓల్డ్‌ఏజ్ హోం, పటేల్ టింబర్ డిపో, ముషీరాబాద్, ఆర్టీసి క్రాస్‌రోడ్డు, నారాయణగూడ, అలాగే ముషీరాబాద్ నుంచి నారాయణగూడల మధ్యనున్న 1000 ఎంఎం డయా వాటర్ లైన్‌ను మరో చోటకు బదిలీ పనులు కూడా పూర్తి చేశారు. ఈ కారిడార్‌లో 150 పునాదులు పూర్తయినట్లు తెలిపారు. అంతేగాక, కారిడార్ 1లోని మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నిర్మించనున్న కారిడార్‌లో భాగంగా నాంపల్లి, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పునాధుల పనులు పూర్తయ్యాయి.