హైదరాబాద్

కాలుష్య పరిశ్రమల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: భాగ్యనగరం లోపల, చుట్టుపక్కల కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగురోడ్డు బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. మంగళవారం తెలంగాణ శాసన మండలి సమావేశంలో భాగంగా సభ్యులు కర్నె ప్రభాకర్, పూల రవీందర్ ప్రశ్నకు మంత్రి కెటిఆర్ సమాధానం చెబుతూ 2013 మార్చి 1వ తేదీన జారీ చేసిన జీవో 20 ప్రకారం నగరంలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను నగరం నుంచి ఔటర్ రింగురోడ్డు బయటకు తరలించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎంఓఐఎఫ్ మార్గదర్శకాల ప్రకారం కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఔటర్ బయటకు తరలించేందుకు ఈపిటిఆర్‌ఐ అనే సంస్థతో సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని చేపట్టినట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఔటర్ వెలువల రెడ్, ఆరేంజ్ క్యాటగిరీల కింద పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు 19 ప్రతిపాదిక స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో ఒక్కో పరిశ్రమకు అనువైన స్థలాలను ఈపిటిఆర్‌ఐ సూచిస్తోందని వివరించారు.
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు త్వరలో చైనా
నగరంలోని ఎన్టీఆర్ పార్కుకు సమీపంలో ఉన్న స్థలంలో 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన నియమించిన కమిటీ ఇంకా కసరత్తు చేస్తోందని సభ్యుడు డి.రాజేశ్వరరావు ప్రశ్నకు మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానం చెప్పారు. ఈ అంశంపై ఎంతో ముందు చూపుతో కమిటీ వ్యవహారిస్తుందని, ఇందులో భాగంగానే గుజరాత్, సిక్కిం రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ త్వరలో చైనాకు వెళ్లనున్నట్లు తెలిపారు. విగ్రహం నమూనాను అన్ని పార్టీల నేతలు అంగీకరించిన తర్వాత ఏర్పాటు చేస్తామన్నారు. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి విగ్రహాన్ని చూస్తే అంబేద్కర్‌ను చూసినట్లు అనుభూతి కలగాలన్న సంకల్పంతో ఈ విగ్రహం ఏర్పాటుపై ఆచితూచీ వ్యవహరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏ లోహంతో తయారు చేయాలి, ఎంత కాలం వరకు నాణ్యత ఉంటుందన్న అన్ని రకాల టెక్నికల్ విషయాన్ని పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు ఎంత వరకు ఖర్చవుతుందన్న కాంగ్రెస్ సభ్యుల ప్రశ్నకు ఇప్పటి వరకైతే రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు ఖర్చయ్యేలా ప్రతిపాదనలున్నాయని మంత్రి వివరించారు.