హైదరాబాద్

ఆధునిక ఈ-టాయిలెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా స్వచ్ఛ్భారత్ మిషన్ వచ్చే నెల 4 నుంచి దేశవ్యాప్తంగా 500 నగరాల్లో నిర్వహించనున్న స్వచ్ఛసర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకును దక్కించుకునేందుకు జిహెచ్‌ఎంసి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకు సాధించేందుకు వీలుగా ప్రజల అవగాహనను పెంచుకొవల్సిన అంశాలను విడుదల చేసిన జిహెచ్‌ఎంసి ఇపుడు ప్రజలకు నగరంలో వీలైనన్ని టాయిలెట్లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పెట్రోలు బంకుల్లోని టాయిలెట్లను సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేందుకు వీలుగా బంకుల యజమానులతో చర్చలను నిర్వహించింది. అంతేగాక, పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆహ్వానించనుంది. ఇందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు ముందుకొచ్చారు. నగరంలో ఆధునిక టాయిలెట్లను ఏర్పాటు చేసే అంశంపై ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ శంతన్ ముఖర్జీ గురువారం జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డిని అధికారికంగా కలుసుకున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆధునిక టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు తమ బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేసే ఈ-టాయిలెట్లకు గాను టెండర్ ప్రక్రియను కూడా జిహెచ్‌ఎంసి పూర్తి చేసింది.
మహిళలు ఉపయోగించే ఈ టాయిలెట్ల ఏర్పాటుకు ఒక్కొదానికి రూ. 7.30లక్షలు, పురుషులు వినియోగించేదానికి రూ. 6.35లక్షల వ్యయం అవుతోంది. ప్రస్తుతం బెంగుళూరులోని కృష్ణాపార్కులో మాత్రమే ఇలాంటి ఈటాయిలెట్లను ఏర్పాటు చేయటం జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఈ-టాయిలెట్ల ప్రత్యేకత : అత్యంత సులువుగా ఏర్పాటు చేసే ఈ టాయిలెట్లలో అతి తక్కువగా నీటి వినియోగం, ఆటోప్లస్, ఆటోక్లీనింగ్ సౌకర్యంతో ఎప్పటికపుడు ఇవి పరిశుభ్రంగా ఉండటం వీటి ప్రత్యేకత. కేవలం కాయిన్ల ద్వారా నిర్వహణ జరిగే ఈ టాయిలెట్ల ద్వారా అనరోబిక్ బయోడీగ్రిడేషన్ ద్వారా నిర్వాహణ జరుగుతోంది.
మ్యాన్‌వెల్ క్లీన్, రెగ్యులర్ మెయింటనెన్స్ వీటికి అవసరం లేదు. కోల్డ్‌రోల్డ్ స్టీల్ ద్వారా నిర్మించిన టాయిలెట్ బాడి అత్యంత పటిష్టంగా ఉండటంతో పాటు దీనిలో ప్రీ ఫ్లష్, ఆటోప్లష్, ఆటోమెటిక్ ఫ్లాట్‌ఫాం, క్లీనింగ్ సదుపాయం కల్పించారు. టాయిలెట్ ఖాళీగా ఉన్నపుడు ఎల్‌ఇడి లైటు ద్వారా తెల్సుకునే అవకాశం కూడా కల్పించారు.