హైదరాబాద్

శివార్లకు నీటి సరఫరా రూ.1900 కోట్లతో అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: నగర శివారు ప్రాంతాల్లో నీటి సరఫరాను మెరుగు పర్చేందుకు రూ.1900 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వచ్చే ఫిబ్రవరి నాటికి పనులు పూర్తిచేసి నీటి సరఫరాను ప్రారంభిస్తామని పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన గురువారం సభ ప్రారంభమయింది. ము ందుగా సభలో ప్రశ్నోత్తారాల పర్వం కొనసాగింది. మండలిలో సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్ రావు హైదరాబాద్ నగరంలో నీటి సరఫరా, నూతన పైప్‌లైన్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో మంత్రి కెటిఆర్ సమాధానమిస్తూ నగరంలో మంచి నీటి పైప్‌లైన్, డ్రైనేజీ పైప్‌లైన్లను ఆధునీకరించేందకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నగర శివారు ప్రాంతాలైన అల్వాల్, కాప్రా, ఉప్పల్, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, ఎల్‌బినగర్, గడ్డిఅన్నారం, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు సర్కిళ్లలో ఫీడర్‌మెయిన్‌తో పాటు అవసరమైన స్టోరేజీ రిజర్వాయర్లు, పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం రూ.1900 కోట్లతో పనులు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. వీటిలో రూ.1700 కోట్లు హడ్కోరుణం కాగా మరో రూ.200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని స్పష్టం చేశారు. శివారు ప్రాంతాల్లో 56 రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు 2700 కిలోమీటర్లు మేర నీటి పైప్‌లైన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. వీటిలో దాదాపు 2380 కిలోమీటర్లు డిఐ పైప్‌లైన్, మిగతా మూడు వందల కిలో మీటర్లు ఎంఎస్ పైప్‌లైన్ నిర్మాణం చేపడుతామని, పనులు వచ్చేమార్చికల్లా పూర్తిచేస్తామని మంత్రి మండలిలో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ప్రజల నీటి అవసారాలు తీర్చేందుకు కృష్ణా ఫేజ్-1, 2, 3లతో పాటు గోదావరి జలాల తరలింపు పథకం కింద మొత్తం 392 ఎంజిడీల నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే వేసవి కాలం నాటికి నగరంలో నీటి సరఫరాను మరింత మెరుగు పరుస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 460 కిలో మీటర్ల వరకు నీటి పైప్‌లైన్‌ను ఆధునీకరిస్తామని అందు కోసం రూ.502 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. అదే విధంగా నగరంలో డ్రైనేజీ పైప్‌లైన్‌కు సంబంధించి 926 కిలోమీటర్ల మేర ఆధునీకరించేందుకు గాను రూ.1240 కోట్లతో పనులు చేపడతామని మంత్రి వివరించారు.
ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం: కడియం
రాష్ట్రంలో 1561 ఉర్దూ పాఠశాలలున్నాయని, వీటిలో మొత్తం 6748 మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 5181 మంది పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద 1667 ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని త్వరలో భర్తీ చేస్తామని సభ్యులు సయ్యద్ అల్త్ఫా హైదర్ రజ్వీ, సయ్యద్ ఆమినుల్ హసన్ జాఫ్రీలు అడిగిన ప్రశ్నకు కడియం సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగరంలో ఉర్దూ టీచర్ పోస్టులు 496 ఉన్నాయని, వాటిలో హైస్కూలులో 226, ప్రాథమికోన్నత పాఠశాలలో 6, ప్రాథమిక పాఠశాలలో 264 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నియామకాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కాకుండా ఉపాధ్యాయులను నియమించే బాధ్యత జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతుల కల్పన కోసం ప్రభుత్వం రూ.235 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, కేవలం హైదరబాద్ జిల్లాకే రూ.45 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి వాటర్, టాయిలెట్‌ల క్లీనింగ్ తదితర పనుల నిర్వహణ కోసం ప్రభుత్వ లక్ష, యాభైవేల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఘననీయంగా పెరింగిందని మంత్రి వెల్లడించారు. ప్రశ్నోత్తారాల సమయంలో సభ్యులు రాష్ట్రంలో జిల్లాల వారీగా బిందు సేధ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణం, నకిలీ మిరప విత్తనాల సరఫరా, గోదావరి నదిపై వంతెనల నిర్మాణం, జంటనగరాల్లో ఉర్దూ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, అటవీ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయుట వంటి ప్రశ్నలకు సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కెటిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్నలు సమాధానాలిచ్చారు.

ఓలా కార్యాలయంపై డ్రైవర్ల దాడి

డ్రైవర్లను అడ్డుకున్న బౌన్సర్లు

కెపిహెచ్‌బి కాలనీ, డిసెంబర్ 29: సమస్యలపై యాజమాన్యాన్ని కలిసేందుకు వచ్చిన ఓలాక్యాబ్ డ్రైవర్లను బౌన్సర్లు అడ్డుకోవడంతో కూకట్‌పల్లిలోని ఓలా కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్యాబ్ డ్రైవర్లను సంస్థ యాజమాన్యాన్ని కలవకుండా బౌన్సర్లు అడ్డుకోవడంతో ఆగ్రహించిన డ్రైవర్లు బౌన్సర్లను చికతబాది సంస్థపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కార్యాలయం అద్దాలతో పాటు ఫర్నిచర్ ధ్వంసమైంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న కెపిహెచ్‌బి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గత కొద్ది రోజులుగా వాహనాల సంఖ్య పెరిగిందని, ఓలా క్యాబ్స్ ఇచ్చిన వాహనాలు సరిగ్గా నడవడం లేదని డ్రైవర్లు పేర్కొంటున్నారు. రూ.30వేలు పెట్టిన వారికి బుకింగ్స్ ఇస్తూ లక్షలు పెట్టి కార్లు కొన్న తమకు బుకింగ్స్ లేకపోవడంతో కమీషన్లు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. క్యాబ్ యాజమాన్యం నగరంలో రోజురోజుకు కొత్త క్యాబ్‌లు తీసుకోవడంతో డ్రైవర్స్‌కు గిట్టుబాటు కావడం లేదన్నారు. టార్గెట్ పేరుతో టార్చర్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్లు తమకు న్యాయం చేయాలంటూ కెపిహెచ్‌బి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.