హైదరాబాద్

న్యూ ఇయర్ వేడుకలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు నగర పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. న్యూ ఇయర్ వేడుకల్లో ప్రత్యేకించి హోటళ్లు, పబ్, క్లబ్, వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఈవెంట్‌లపై ప్రత్యేక దృష్టిసారించారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు 15వందల మంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేస్తే ఈవెంట్ మేనేజర్‌పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఈవెంట్‌కు వచ్చిన వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత కూడా ఈవెంట్ నిర్వహకులదేనని ఆయన పేర్కొన్నారు. ఇక డీజేలకు అనుమతి లేదని న్యూ ఇయర్ వేడుకలకు ఈనెల 31 రాత్రి ఎనిమిది గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆలోపే వేడుకలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ నిర్వహించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. వారిపై మోటార్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా రోడ్లపై వేళ్లే వారిపై నగర పోలీసులు ప్రత్యేక నిఘాను ఉంచి రోడ్లపై ఎవరైనా సంఘటనలు జరిగితే వెంటనే అక్కడికి పోలీసులు సకాలంలో చేరేలా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కేవలం ఈనెల 31 రాత్రి అన్ని ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాల పర్యవేక్షణ కోసం కొంత మంది పోలీసులను ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం.

నేటితో ముగియనున్న ఎల్‌ఆర్‌ఎస్ గడువు
ఉప్పల్, డిసెంబర్ 30: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) పరిధిలో లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మరోసారి ఇచ్చిన గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ అవకాశాన్ని ప్రజలు చివరి రోజు శనివారం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ చిరంజీవులు పేర్కొన్నారు. 2015 నవంబర్ 28 తేదీ నాటికి ప్లాట్లు కొనుగోలు చేసి హెచ్‌ఎండిఏ అనుమతులు లేకుండా, గతంలో దరఖాస్తు చేసుకోని వారికి మరల డిసెంబర్ 31వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇతర వివరాలకోసం తార్నాక హెచ్‌ఎండిఏ కార్యాలయంలోని సహాయక కేంద్రంలో స్వయంగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని