హైదరాబాద్

నయాజోష్... హ్యపీ ఫుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. యువతలో నయా జోష్..ఆనందోత్సాహాలను నింపింది. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రత్యేకించి హోటళ్లు, పబ్, క్లబ్, రిసార్ట్స్ వంటి ప్రాంతాల్లో శనివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు రోడ్లపై ఏలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ వేడుకల్లో 15వేల మంది పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. డ్రగ్స్ సరఫరా చేస్తే ఈవెంట్ మేనజర్‌పై కేసు నమోదు చేస్తామని హెచ్చకలు జారీ చేశారు. అలాగే ఈవెంట్‌కు వచ్చిన వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత కూడా ఈవెంట్ నిర్వహకులదేనని పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణాయాలు సత్ఫలితాలిచ్చాయి. ఇక డీజేలకు అనుమతి లేదంటూ న్యూ ఇయర్ వేడుకలకు డిసెంబర్ 31 రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజాము రెండు గంటల వరకు మాత్రమే అనుమతించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పకడ్బందిగా వంద స్టాటిక్, మోబైల్, డేకాయ్, స్పెషల్ డిడి టీమ్‌లను బందోబస్తులో నియమించి, నగరంలోని అన్ని ప్రాంతాలను వీడియోల ద్వారా రికార్డ్ చేశారు.
* డ్రంకన్ డ్రైవ్‌లో 957 కేసులు నమోదు
నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శనివారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 957 కేసులు నమోదయ్యాయి. పోలీసులు వందలాది వాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. వాహనాలు సీజ్ చేసిన వారిలో 27 నెంబర్‌ప్లేట్‌లు సరిగ్గా లేనివి, ప్రమాధకరమైన డ్రైవింగ్ చేసిన 16 మంది, 31 మంది ఓవర్ స్పీడ్ డ్రైవ్, 37 మంది ట్రిబుల్ రైడింగ్ చేసిన వారు ఉన్నారు. మోటార్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా రోడ్లపై వేళ్లే వారిపై నగర పోలీసులు ప్రత్యేక నిఘాను ఉంచి రోడ్లపై అనుకోని పరిస్థితుల్లో సంఘటనలు జరిగితే వెంటనే అక్కడికి స్థానిక పోలీసులు సకాలంలో చేరేలా నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు.

నగదు రహిత లావాదేవీలతో పారదర్శకత
- కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
ఖైరతాబాద్, జనవరి 1: నగదురహిత లావాదేవీలతో పారదర్శకత పెరుగుతుందని, తద్వారా దేశం అభివృద్ధితో దూసుకుపోయే అవకాశం సైతం ఏర్పడుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సోమాజిగూడలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో క్యాష్‌లెస్ లావాదేవీలకు ఉపకరించే ఈ-వాలెట్, పిఓఎస్ యంత్రాలను ఎమ్మెల్సీ రామచంద్రారావు, ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్. ప్రభాకర్‌లతో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లధనం, అవినీతిని నిర్మూలించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గడిచిన 2016 సంవత్సరం దేశ ప్రజలందరికీ మరచిపోలేని సంవత్సరమని, నిత్యం సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న పాక్‌కు సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ధి చెప్పడమే కాకుండా పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఉగ్రచర్యలు లేకుండా చేయగలినట్టు చెప్పారు. నిత్య జీవితంలో భాగమై పోయిన పెట్రోల్, డీజిల్ విక్రయాలను సులభతరం చేసేందుకు ఈ-వ్యాలెట్ ఎంతగానో దోహపడుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 900 బంక్‌ల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటిని వినియోగించడం వల్ల అటు వినియోగదారునికి, ఆయా బంకుల్లో పనిచేసే కార్మికులకు పని సులువుగా అవుతుందని చెప్పారు. అనంతరం బంక్ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సమావేశంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలుగు రాష్ట్రాల డైరెక్టర్ ఉమాకాంత్ ప్రసాద్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.