హైదరాబాద్

ప్రయాణం నరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోరైలు పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో ప్రయా ణం వాహనదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపుతోంది. ముఖ్యంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నిర్మిస్తున్న కారిడార్‌లో భాగంగా అమీర్‌పేట, ఖైరతాబాద్ చౌరస్తాలతో పాటు లక్డీకాపూల్, నాంపల్లి ప్రాంతాల్లో ప్రయాణించాలంటే గగనంగా మారింది. ముఖ్యంగా అమీర్‌పేట మైత్రివనం చౌరస్తాలో మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్, అలాగే నాగోల్-శిల్పారామం కారిడార్‌లు కలవటంతో ఇక్కడ అధికారులు ఇంటర్ ఛేంజ్ మెట్రో స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్ నుంచి అటు మియాపూర్, ఇటు శిల్పారామం వైపు రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నారు. దీంతో రోడ్డుపై భారీ పిల్లర్లు నిర్మించటంతో ప్రస్తుతం రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో ఇక్కడ వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు వర్ణణాతీతం. భారీ పిల్లర్లు ఆక్రమించుకున్న రోడ్డు మినహా మిగిలిన రోడ్డును మెట్రో, ట్రాఫిక్ పోలీసుల చిన్న, మధ్య, భారీ తరహా వాహనాలకు ప్రత్యేకంగా కేటాయించారు. అంతేగాక, ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రత్యేకంగా మెట్రో మార్షల్స్‌ను కూడా నియమించారు. కానీ వాస్తవానికి మెట్రో మార్షల్స్‌తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ ట్రాఫిక్‌ను మళ్లించాల్సి ఉన్నా, కేవలం మెట్రో మార్షల్స్ మాత్రమే దర్శనమిస్తున్నారు. దీంతో మెట్రోమార్షల్స్ ట్రాఫిక్ మళ్లించటంతో కొన్ని సార్లు వాహనదారులతో వాగ్వాదాలు తలెత్తుతున్నాయి. ఎటు నుంచి ఏ వాహనం ప్రయాణించాలో తెలిసే విధంగా ప్రత్యేకంగా బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అయినా జనానికి ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. ఇక పాదచారుల ఇక్కట్లు వర్ణణాతీతం. అంతేగాక, ఈ చౌరస్తాలోని సిగ్నల్ దాటగానే బస్టాపు ఉండటంతో అక్కడ బస్సులు నడిరోడ్డు వరకు నిల్చుండటంతో అమీర్‌పేట నుంచి సంజీవరెడ్డినగర్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇక మెట్రోరైలు పనుల కారణంగా నాంపల్లి చౌరస్తాలో కూడా ఆంక్షలు అమలు చేస్తుండటంతో ట్రాఫిక్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. గాంధీభవన్ నుంచి హ్యాండ్లూమ్ భవన్ వద్దనున్న సిగ్నల్ మీదుగా వాహనాలను పబ్లిక్‌గార్డెన్స్ వైపు అనుమతించేవారు. కానీ కొద్దిరోజులుగా ఈ సిగ్నల్‌ను మూసివేసి గాంధీభవన్ నుంచి వచ్చే వాహనాలను ఇంటర్మీడియట్ బోర్డు, ప్రియదర్శిని కాలేజీ, ఏక్‌మినార్ చౌరస్తాల మీదుగా కుడివైపుకు అనుమతించటంతో రైల్వే స్టేషన్ ముందు ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. మెట్రోరైలు పనులు ఊపందుకోవటంతో తలెత్తిన ట్రాఫిక్ కష్టాలు తాత్కాలికమే అయినా, కనీసం సక్రమంగా ట్రాఫిక్‌ను దారి మళ్లించకపోవటం, ఇరుకుగా మారిన రోడ్లపైనే అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవటం వల్లే తమకు కష్టాలు పెరిగాయని వాహనదారులు వాపోతున్నారు.

ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలి
కలెక్టర్ రఘునందన్‌రావు

హైదరాబాద్, జనవరి 2: జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎగువ స్థాయి అధికారి నుండి దిగువ స్థాయి గుమస్తా వరకు అందరూ ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల పేమెంట్, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల కేటాయింపులు, పెన్షన్‌లు, భూ సమస్యలు, ఆహార భద్రతాకార్డులు, రుణ మంజూరు తదితర అంశాలపై 43 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, సిపిఓ వైవి శర్మ పాల్గొన్నారు.