హైదరాబాద్

డ్రంకైన్ డ్రైవ్‌లో పట్టుబడిన 28 మందికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు 38 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అయితే అప్పుడు వివిధ కేసుల్లో నాలుగు వందల మంది పట్టుబడ్డారు. వీరిలో పలువురికి కౌనె్సలింగ్ నిర్వహించి వదిలిపెట్టగా, మరికొందరిపై పెట్టి కేసులు పెట్టారు. కేసు తీవ్రతను బట్టి మద్యం మత్తులో డ్రైవ్ చేసినట్టు 28 మందిని గుర్తించారు. మోతాదుకు మించి మద్యం సేవించిన 28 మందికి మల్కాజ్‌గిరి కోర్టు శిక్ష విధించింది. మల్కాజ్‌గిరి ట్రాఫిక్ ఇనె్స్పక్టర్, మల్కాజ్‌గిరి ఏసిపి శివరాం ఆధ్వర్యంలో జనవరి ఒకటోతేదీ తెల్లవారు జాము నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పట్టుబడ్డ వారిని మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు 28 మందికి ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిందని ఇన్‌చార్జి ట్రాఫిక్ డిసిపి దివ్యచరణ్ రావు తెలిపారు.
140 మంది బాలకార్మికులకు విముక్తి

హైదరాబాద్, జనవరి 3: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ పేరుతో 140 మంది బాలకార్మికులకు విముక్తి కలిగింది. చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులో రాచకొండ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న దాదాపు 140 మందిని బాలకార్మికులుగా గుర్తించారు. వివిధ బట్టీల్లో పనిచేస్తున్న వీరికి విముక్తి కలిగించారు. ఈ చిన్నారులంతా ఒడిశాకు చెందినవారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ తెలిపారు.

జలమండలి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్, జనవరి 3: జలమండలి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సంఘం ఆధ్వర్యంలో రూపొందిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ ఆవిష్కరించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎండి క్యాలెండర్‌ను ఆవిష్కరించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జలమండలి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి డి.అశోక్, వైస్ చైర్మన్‌లు శంకర్‌ప్రసాద్, విశ్వనాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ కె.సత్యనారాయణ, బి.అశోక్‌లతో పాటు దీపు, ఉదయ్‌కుమార్, మురళి, కార్తిక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.