హైదరాబాద్

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: సంక్రాంతి పండుగను తన స్వస్థలాల్లో జరుపుకునేందుకు వెళ్తున్న జంటనగర వాసుల రద్దీకి తగిన విధంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణి, నగర బిజెపి మాజీ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పండుగకు చాలా మంది నగరవాసులు ఇప్పటి నుంచే తమ స్వస్థలాలకు ప్రయాణం కావటంతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో ప్రయాణికుల సందడి కన్పిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ సందర్భంగా 5 నుంచి పది లక్షల మంది ప్రయాణం చేస్తుంటారని వివరించారు. కానీ ఈ ఏటా గతంలో మాదిరిగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయలేదని, దీంతో ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతారని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా, రద్దీకి అనుకూలంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఎలాంటి కార్యచరణ లేకపోవటం విచారకరం అన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడుపుతారా? లేదా? అనే అంశంపై ఎలాంటి స్పష్టత లేదని, అధికారుల ఈ తాత్సారం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఇబ్బందుల పాల్చేసేలా ఉందన్నారు. ప్రత్యేక రైళ్లు అందుబాటులో లేకపోవటంతో అదే అదునుగా చూసి ప్రైవేటు బస్సు ఆపరేటర్లు రెట్టింపు ధరలకు టికెట్లు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారని వాపోయారు. ప్రజలపై ఆర్థికంగా బారం పడే ఇలాంటి పరిణామాలకు చెక్ పెడుతూ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నగరం నుంచి విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నంతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపాలని, అడ్వాన్సుగా టికెట్ల బుకింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.

గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

ఖైరతాబాద్, జనవరి 4: గంగపుత్రుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గంగపుత్రుల సంఘం నాయకులతో కలిసి నాయిని ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. గంగపుత్రులు టిఆర్‌ఎస్ తగిన ప్రాధాన్యత ఇచ్చి వారికి చట్టసభల్లో పాత్రినిధ్యం కల్పించేలా కృషి చేస్తుందన్నారు. గంగపుత్రులు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే సిఎం ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు చెరువుల అభివృద్ధి కోసం గంగపుత్రులకు వాటా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
సంఘం అధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ గంగపుత్రుల వృత్తి చేపలు పట్టడమని, తమ కులవృత్తిలోకి ముదిరాజ్ కులస్థులు ప్రవేశించి రిజర్వేషన్లు పొందాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా తమ కులాలకు చట్టసభల్లో ప్రాతినిద్యం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో వీరన్న, శ్రీహరి, మల్లేష్, విజయ్‌కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.

నోరి రాధికకు పురస్కార ప్రదానం
కాచిగూడ, జనవరి 4: ప్రముఖ గాయని, రచయిత నోరి నరసింహశాస్ర్తీ మనువడి భార్య నోరి రాధికకు ‘నాన్ రెసిడెంట్ ఇండియన్ వంశీ ఎక్సలెన్సీ మ్యూజిక్ అవార్డు 2017’ను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి ప్రదానం చేశారు. రాధిక నోరి సంఘసేవా కార్యక్రమాలకు తన గానం ద్వారా చేయూతనివ్వడం ప్రశంసనీయమని అన్నారు. రాధిక మాట్లాడుతూ తన జీవితంలో సినారె పాటలు ఎన్నోపాడానని వారి చేతుల మీదుగా అవార్డును పొందడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ సహకారంతో తాను సినారె గేయాలతో ఆల్బం రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, తెనే్నటి సుధాదేవి, గంగా భాస్కరరెడ్డి పాల్గొన్నారు.

జిహెచ్‌ఎంఇయు క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మేయర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం గుర్తింపు పొందిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్(జిహెచ్‌ఎంఇయు) నూతన సంవత్సరానికి రూపొందించిన క్యాలెండర్ 2017ను మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. కార్మిక విభాగం అధ్యక్షుడు, యూనియన్ అధ్యక్షుడు ఊదరిగోపాల్ నేతృత్వంలో ఈ క్యాలెండర్ రూపొందింది. యూనియన్ అధ్యక్షుడు ఊదరిగోపాల్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి పరిధిలో ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో తమ యూనియన్ ముందుంటుందని వివరించారు. ఇప్పటి వరకు ఉద్యోగులు, కార్మికులకు చెందిన ఎన్నో న్యాయమైన డిమాండ్లను సాధించుకోవటంలో తమ యూనియన్ కీలకమైన పాత్ర పోషించిందని వివరించారు. అన్ని క్యాటగిరీల ఉద్యోగులు, కార్మికుల ఆదరణ పొందిన తమ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించకముందే గ్రేటర్‌లో విజయాన్ని సాధించిన విషయాన్ని గోపాల్ గుర్తుచేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.బాలనర్సింగ3రావు, సలహాదారు విఠల్‌రావు కులకర్ణి, సెంట్రల్ జోన్ అధ్యక్షుడు వో.శంకర్, నార్త్‌జోన్ అధ్యక్షుడు బి.యాదగిరి, వెస్ట్‌జోన్ అధ్యక్షుడు బి.రాము, సౌత్‌జోన్ అధ్యక్షుడు కృష్ణతో పాటు యూనియన్ నేతలు డి.నర్సింగ్‌రావు, రాకేశ్‌కుమార్, మహ్మద్ ఫయాజ్ పాల్గొన్నారు.