హైదరాబాద్

తెలంగాణలో రైతులకు మంచి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు విప్లవాత్మక మార్పులు వస్తాయని, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. ఇఫ్‌కో స్వర్ణోత్సవాల సందర్భంగా రవీంద్రభారతిలో గురువారం జరిగిన సంబరాలకు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించడానికి, ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలు అవసరమని అన్నారు. 1969లో పురుడుపోసుకున్న ఇఫ్‌కో 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని విజయవంతంగా 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రైతు జీవితానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. 1960లో ప్రారంభమైన హరిత విప్లవం ద్వారా వంగడాలు, నీరు, ఎరువులు వ్యవసాయానికి చాలా ముఖ్యమని ఆనాటి నుంచి ఎవరిని అడగకుండా వ్యవసాయానికి కావాల్సిన అన్ని వసతులు సమకూర్చుకోవడం విశేషమని అన్నారు. ఫెర్టిలైజర్ పరిశ్రమకు పితామహుడు ఇఫ్‌కో మేనేజింగ్ డైరెక్టర్ డా. యుఎస్ అవస్థి ప్రధాన కారణమని పేర్కొన్నారు. తెలంగాణలో 120 ఎఫ్‌ఎసిటిఎస్ ఉన్నాయి. తెలంగాణ రాకముందు విత్తనాలు మండలాల్లో దొరికేవి కాదు.. రాష్ట్రం ఏర్పడ్డాక ఎఫ్‌ఎసిటిఎస్ ద్వారా రైతుకు అవసరమైనవన్నీ మండలాలలోనే దొరుకుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న 900 సొసైటీలలో 465 సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయని, మొబైల్ సాయిల్ టెస్టింగ్ వాహనాలను కూడా ఏర్పాటుచేస్తున్నామని పార్థసారథి అన్నారు. ఈ కార్యక్రమానికి ఇఫ్‌కో డైరెక్టర్ ఎ.ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కె.రవీందర్‌రావు, దేవేందర్ రెడ్డి, సుజాత రెడ్డి పాల్గొన్నారు.

ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
ముషీరాబాద్, జనవరి 5: తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల వ్యవహారం పరిష్కారం కాకపోవటం శోఛనీయమని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నియంత్రించాలనే అంశంపై తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. సభాధ్యక్షత వహించిన నాగటి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల సమస్య తీవ్రతను, దాని నియంత్రణ కోసం జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఫీజుల రేట్లను నిర్ణయిస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లోని లోపాల వల్ల కోర్టుల్లో నిలువలేకపోయాయని, దీనితో మేనేజ్‌మెంట్ల దోపిడీకి అదుపు లేకుండా పోయిందని, అందుకే జిఓలకే పరిమితం కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల మాదిరిగా ప్రత్యేక చట్టం తేవాలని ప్రతిపాదించారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్ల పని విధానం సరిగా లేకపోవటం వల్ల పిల్లల చదువు కోసం ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు అధిక ఫీజులతో కుంగిపోతున్నారని, పేరెంట్స్ రైట్స్ కోసం ప్రత్యేక ఉద్యమాలు చేయాలని అన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే భారీ ఫీజులు ఉండటం టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయకపోవటంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతూ ప్రైవేటు విద్యావ్యాపారం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్ధులు టీచర్లు సంఘటితమై ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాలని సూచించారు.
ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టిజెఎసి స్టీరింగ్ కమిటి కమిటీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, సిఐటియు జాతీయ కార్యదర్శి సుధాభాస్కర్, నారాయణరెడ్డి, విద్యార్ధి సంఘాల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. డ్రాప్టింగ్ కమిటిని ఏర్పాటు చేసి చైర్మన్‌గా చుక్కా రామయ్య, కోచైర్మన్‌గా న్యాయవాది సత్యప్రసాద్, సమన్వయకర్తగా నారాయణ ఎన్నుకున్నారు.