హైదరాబాద్

చెత్త వంద కిలోలు మించితే ఛార్జీలు చెల్లించాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: మహానగరంలో వంద కిలోలకు మించి చెత్తను ఉత్పత్తి చేసే వ్యాపార సంస్థలు ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లించాల్సిందే! ఘన వ్యర్థాల నియంత్రణ చట్టం-2016ను అమలు చేస్తూ ఈ ఛార్జీలను వసూలు చేయాలని గురువారం జరిగిన స్థారుూ సంఘం తీర్మానం చేసింది. వంద కిలోలకు మంచి అదనంగా వచ్చే చెత్త ప్రతి కిలోకు రూ. 2.25పైసులు ఛార్జీలుగా చెల్లించాల్సి వస్తోందని కూడా నిర్ణయించారు. ఇందులో ముఖ్యంగా హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు ఇతర ఆహార విక్రయ కేంద్రాలు వంటి వ్యాపార సంస్థలు రానున్నట్లు కూడా స్థారుూ సంఘం గురువారం తీర్మానం చేసింది. గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్థారుూ సంఘం సమావేశం ముందుకొచ్చిన మొత్తం 16 అంశాలకు ఆమోదం తెలిపింది. ఇందులో స్వచ్ఛ సర్వేక్షణ్ 2017పై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులకు యాపిల్ ఐపాడ్‌లను ఇవ్వాలన్న ప్రతిపాదనను సైతం ఆమోదించింది. దీంతో పాటు పారిశుద్ద్య కార్మికుల పనితీరును మెరుగుపరిచేందుకు, వారిలో జవాబుదారితనాన్ని పెంపొందించేందుకు గాను వారికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కూడా స్థారుూ సంఘం నిర్ణయించింది. దీంతో పాటు జిహెచ్‌ఎంసికి సంబంధించిన ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సు, ఇతర పన్నులను ఆన్‌లైన్‌లో చెల్లించే నగర పౌరుల సర్వీస్ ఛార్జీలను జిహెచ్‌ఎంసి భరించేందుకు వీలుగా అనుమతి కోరుతూ త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కూడా సంఘం తీర్మానం చేసింది.
వీక్లీ మార్కెట్లపై తదుపరి భేటీలో చర్చ
ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వారానికోసారి జరగుతున్న వీక్ల్లీ మార్కెట్లపై వచ్చే వారం జరిగే సమావేశంలో చర్చించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ఈ వీక్ల్లీ మార్కెట్ల వల్ల స్థానికంగా ఉండే వ్యాపారులకు నష్టం వాటిల్లడటంతో పాటు మార్కెట్ల నిర్వాహణ తర్వాత రోడ్లపై పెద్ద ఎత్తున చెత్తను పోగవుతూ, తీవ్ర (1వపేజీ తరువాయ) సమస్యలేర్పడుతున్నాయని ఈ విషయాన్ని సభ్యుడు సలీం ప్రస్తావించగా, వచ్చే వారం చర్చిద్దామని మేయర్ వ్యాఖ్యానించారు.
ఆమోదించిన అంశాలు
* మియాపూర్ నుంచి నాగార్జున హోమ్స్, ఆదిత్యనగర్ మీదుగా ఎల్లమ్మబండ వరకు లింకురోడ్డు నిర్మాణానికి మూడు కోట్లతో చేపట్టాలన్న ప్రతిపాదనకు మోక్షం లభించింది.
* లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్‌నగర్ మీదుగా నారాయణగూడ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా రూ. 7లక్షల 68వేల 305 రూపాయలు భూసేకరణ నిమిత్తం అందజేసేందుకు స్థారుూ సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* దారుస్సలాం జంక్షన్ నుంచి బోయిగూడ మీదుగా నోబెల్‌టాకీస్ జంక్షన్ వరకు 80 అడుగుల రోడ్డు విస్తరణకు సవరించిన అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం
* చార్మినార్ పాదచారుల క్షేత్రం ప్రాజెక్టు కింద కోట్ల అలీజా వద్ద పార్కింగ్ లాట్‌కు 40 అడుగుల అప్రోచ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలకు గురువారం నాటి స్థారుూ సమావేశం ఆమోదం తెలిపింది.
* త్వరలో నగరంలో మెస్సర్స్ ఎలెట్స్ ఆధ్వర్యంలో జరిగే సమగ్ర పట్టణాభివృద్ధి జాతీయ సదస్సుకు జిహెచ్‌ఎంసి తరపున సహకారం అందించాలని స్థారుూ సంఘం నిర్ణయించింది.
* నగరంలో నిర్మించనున్న 40 మోడల్ మార్కెట్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు రూపొందించిన మార్గదర్శకాలకు సైతం ఆమోదం లభించింది.
* ఫతేనగర్ నుంచి రాజ్‌భవన్ ఆర్‌యుబి మార్గంలో రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణకు రూ. 67.40లక్షలను అందజేసేందుకు అనుకూలంగా తీర్మానం
* పంజాగుట్ట వద్ద రోడ్డు విస్తరణలో సేకరించిన స్థలానికి రూ. 42లక్షల 31వేల 742 నష్టపరిహారంగా చెల్లించేందుకు అనుకూలంగా నిర్ణయం
* త్వరలో జరగనున్న ప్రీమియం బ్యాడ్మింటన్ లీగ్ క్రీడలను నిర్వహిస్తున్న హైదరాబాద్ హంటర్స్‌కు రూ. పది లక్షలు ఆర్థిక సహాయంగా అందించేందుకు ఆమోదం
* జిహెచ్‌ఎంసి పారిశుద్ద్య సిబ్బంది పనితీరును మెరుగుపర్చటంతో పాటు జవాబుదారితనాన్ని పెంపొందించేందుకు వారికి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం.
* ఈ-ఆఫీసు నిర్వాహణలో భాగంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఉన్న ప్రధానమైన ఫైళ్లను ఎఫ్‌టిసి సర్వర్ ద్వారా అప్‌లోడ్ చేయటానికి డిజిటైజేషన్, ఇన్‌డెక్స్‌ను చేసేందుకు ప్రతిపాదనల ఆమోదం
* 14వ ఆర్థిక సంఘం ద్వారా 2016-17 వార్షికాభివృద్ధి ప్రణాళికలకు ఆమోదం, ఆమోదంతో పాటు మానిటరింగ్ చేసే ప్రతిపాదనలను సైతం గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ స్థారుూ సంఘం తీర్మానం చేసింది.