హైదరాబాద్

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: భూ తగాదాల్లో తల దూర్చిన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీస్ అధికారులు ప్రైవేటు వ్యవహారాలపై ఆసక్తి చూపుతూ, భూ తగాదాలు, సెటిల్‌మెంట్లు చేశారనే ఆరోపణలపై పహాడీషరీఫ్ ఎస్‌ఐ సైదులు, బాలాపూర్ పిఎస్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ నర్సింగ్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ ఎంఎం భగవత్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల సేవలు ప్రజల రక్షణకే పరిమితం కావాలి..కానీ ప్రైవేటు వ్యవహారాలు, భూ తగాదాల్లో తల దూర్చొద్దని ఆయన సూచించారు.
జంతు బలి నివారణకు చర్యలు
త్వరలో జిల్లా స్థాయిలో కమిటీ
జాయింట్ కలెక్టర్ ప్రశాంతి వెల్లడి

హైదరాబాద్, జనవరి 5: నగరంలోని పలు దేవాలయాల వద్ధ జంతుబలిని నివారణకు చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్దమైంది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో జిల్లా స్థాయిలో ఓ ప్రత్యేక కమిని ఏర్పాటు చేయాలని కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి నిర్ణయించారు. నగరంలోని జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మగుడి, లోయర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ కట్టమైసమ్మ దేవాలయం, బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మదేవాలయాల వద్ద జంతు, పక్షుల బలి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఆమె గురువారం కలెక్టరేట్‌లో జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, రవాణా ఇతర శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో జంతు,పక్షుల బలిని నివారించేందుకు జిల్లా స్థాయిలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, రవాణా పోలీసు, పశుసంవర్థక, దేవాయదా శాఖలకు చెందిన అధికారులను సభ్యులుగా నియమించనున్నట్లు ఆమె తెలిపారు. అంతేగాక, ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై జంతువుల, పక్షుల బలి నివారణతో పాటు వాటి సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణను రూపొందిస్తుందని ఆమె వివరించారు. ఇందుకు కమిటీ సభ్యులు తగు సలహాలు, సూచనలు అందించాలని కూడా జెసి కోరారు. తెలంగాణ గోశాల ఫెడరేషన్ అధ్యక్షులు మహేష్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రతీవారం, ప్రతి దేవాలయం వద్ధ జంతుబలులు బహిరంగంగా జరుగుతున్నా, ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నారు. వాటిని నిరోధించేందుకు జిల్లి తరపున తగు చర్యలు తీసుకోవాలని ఆయన జెసిని కోరారు. ఈ సమావేశంలో డిఆర్వో సతీష్‌చంద్ర, హైదరాబాద్ ఆర్డీవో శ్రీ వత్స, జిహెచ్‌ఎంసి అధికారి డా.వెంకటేశ్వర్‌రెడ్డి, జె.విల్సన్, పశు సంవర్థక శాఖాధికారి డా.్భగవాన్‌రెడ్డి, జిపిఎన్.ప్రసాద్, జీవరక్షా ట్రస్టు నుంచి వై.వైభవ్‌రావు, ఎంపి జ్ఞానేశ్వర్, స్వరూప్, రామకృష్ణ, శ్రీనివాసరావు, యోగానంద్, డా.యశ్వంత్‌తో పాటు అమీర్‌పేట, హిమాయత్‌నగర్ మండలాల తహసిల్దార్లు విష్ణుసాగర్, సిహెచ్ వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ శాఖ ప్రతినిధి ఇఫ్తెకార్ నజీమ్ పాల్గొన్నారు.