హైదరాబాద్

రెండు నిమిషాలు చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా దేశవ్యాప్తంగా 500 పై చిలుకు నగరాల్లో పారిశుద్ద్యం మెరుగ్గా చేపట్టే వాటిని గుర్తించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ మొదలైంది. నగర పాలక సంస్థ జిహెచ్‌ఎంసి ఎంత మెరుగైన సేవలను అందించినా, నగర వాసులు ఒక్క రెండు నిమిషాలు కేటాయిస్తేనే మెరుగైన ర్యాంక్ వస్తుందని అధికారులంటున్నారు. ఇందుకు గాను నగరవాసులుగా మనం మన బాధ్యతను నిర్వర్తించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రారంభమైందని, ఈ సర్వే వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతుందన్న విషయాన్ని నగరవాసులు తెల్సుకోవాలని ఆయన సూచించారు. దేశంలో లక్షకు పైబడిన జనాభా ఉన్న అన్ని నగరాలు, మహనగరాల్లో ఒక్కోదానిలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన ప్రతినిధులు బృందం మూడురోజుల పర్యటించి స్థానిక సంస్థలు అందిస్తున్న పారిశుద్ద్య సేవలు, బహిరంగ మల,మూత్ర విసర్జన నివారణ కోసం చేస్తున్న కృషిని గుర్తించటంతో పాటు నేరుగా నగరవాసులను కలిసి స్వచ్ఛతపై వారికున్న అవగాహన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంక్‌ను కేటాయించనున్నాయని అధికారులు చెబుతున్నారు. అన్ని ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం చెప్పి, నగర ప్రతిష్టను దేశంలో మరింత పెంపొందించటానికి నగరవాసులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. గత సంవత్సరం 75 నగరాల్లో నిర్వహించిన ఇలాంటి సర్వేలో మన హైదరాబాద్ నగరానికి 19 స్థానం దక్కింది. ఈ సారి 500 పై చిలుకు నగరాల్లో మరో సారి నిర్వహిస్తున్న ఈ సర్వేలో ప్రశ్నలకన్నింటికి సానుకూలంగా సమాధానం చెప్పి, నగరాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా ఈ సర్వేక్షణ్‌లో పాల్గొనాలని ఆయన కోరారు. మొత్తం 2వేల మార్కులుండగా, 900 మార్కులు కేంద్ర మున్సిపల్ వ్యవహారాల ప్రత్యక్షంగా గమనించిన అంశాలకు, 450 మార్కులు టెలిఫోన్ ద్వారా నగరవాసుల అభిప్రాయ సేకరణకు, మరో 150 మార్కులు స్వచ్ఛయాప్, మై జిహెచ్‌ఎంసి యాప్‌లకు అందే ఫిర్యాదుల పరిష్కారాన్ని బట్టి వేస్తారు. మెరుగైన ర్యాంకు సాధించుకునేందుకు మన చేయాల్సిందేమిటంటే స్వచ్ఛందంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనటమేనని సూచించారు.
మనం బాధ్యత నిర్వర్తించటం చాలా సింపుల్
* టోల్‌ఫ్రీ నెంబర్ 1969కు మిస్‌డ్‌కాల్ ఇవ్వాలి
* తిరిగి మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ నుంచి కాల్ వస్తోంది
* తొలుత స్వచ్ఛ్భారత్‌పై నటుడు అమితాబ్ సందేశం ఉంటుంది.
* ఆ తర్వాత తెలుగు భాష కోసం 1, ఆంగ్లం కోసం 2 నొక్కాలి
* అటు వైపునుంచి హైదరాబాద్ నగరం పిన్‌కోడ్ నెంబర్ అడుగుతారు అపుడు మన 500001 అనే నెంబర్‌ను ఎంటర్ చేయాలి
* ఫోన్‌లో మాట్లాడే నగర పౌరుడ్ని ఆరు ప్రశ్నలు అడుగుతారు, వీటికి సానుకూలంగా ‘అవును’ అనే సమాధానం కోసం ‘ఒకటి’ నొక్కితే చాలు మనం ఆశించిన ర్యాంక్ మన నగరానికి వచ్చే అవకాశముంది.
ఆ ఆరు ప్రశ్నలు
మీ నగరం(హైదరాబాద్) స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో పాల్గొంటున్న విషయం మీకు తెలుసా? అనే ప్రశ్న విన్పిస్తోంది
* గతం కన్నా పోల్చితే ప్రస్తుతం మీ ప్రాంతం శుభ్రంగా ఉందా?
* ఈ సంవత్సరం మార్కెట్ ప్రాంతాల్లో డస్ట్‌బిన్లను ఏర్పటు చేసిన విషయాన్ని మీరు గమనించారా?
* ఇంటింటి నుంచి చెత్తను సేకరించే ప్రక్రియ ఈ ఏటా ఏమైనా మెరుగైందా?
* ఈ సంవత్సరం పబ్లిక్/కమ్యూనిటీ టాయిలెట్‌ల మీకు అందుబాటులో ఉన్నాయా?
* పబ్లిక్/కమ్యూనిటీ టాయిలెట్లలో నీరు, ప్లషింగ్, లైటింగ్, వాషింగ్ తదితర సౌకర్యాలు ఉన్నట్టు గమనించారా? అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

తొలగింపులోనూ వివక్ష

ఆక్రమణలు, ఫ్లెక్సీలు, బ్యానర్లపై చర్యలు ముమ్మరం
పాతబస్తీలో నామమాత్రంగా గుర్తింపు
పలు చోట్ల కార్పొరేటర్ల
కనుసన్నల్లో తొలగింపులు

హైదరాబాద్, జనవరి 6: జిహెచ్‌ఎంసి పరిధిలో డీఫేస్‌మెంట్ యాక్టు అమలు, ఫుట్‌పాత్‌లకు విముక్తి కల్గించేందుకు అధికారులు చేపట్టిన చర్యల్లో వివక్ష చోటుచేసుకుంది. ఆక్రమణలు, అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోష్టర్లను తొలగించటంలో న్యూ సిటీకో రూలు, ఓల్డ్‌సిటీకో రూలు అన్నట్టు అధికారులు వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి డీఫేస్‌మెంట్ యాక్టును అమలు చేస్తున్నట్లు ప్రకటించిన బల్దియా తొలి మూడురోజుల్లో సుమారు 7 లక్షల 5వేల 400 అక్రమ బ్యానర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, కటౌట్లును తొలగించినట్లు ప్రకటించుకున్నా, అందులో అత్యధిక శాతం మంది సామాన్యులే. కాస్త డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న బడా వ్యాపార సంస్థల జోలికెళ్లని జిహెచ్‌ంసి అధికారులు పిచ్చుకలపై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించి ప్రతాపం చాటుతున్నారన్న విమర్శ వెల్లువెత్తుతోంది.
సౌత్ జోన్ పరిధిలోని మదీనా చౌరస్తా మొదలుకుని రోడ్డుకిరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లపై ఏకంగా వంద సంఖ్యలో ఆక్రమణలను దర్శనమిస్తున్నా, వాటిలో అధికారులు ఇప్పటి వరకు ఒక్కటి కూడా తొలగించలేదు. నయాపూల్ వంతెన దాటగానే మదీనా వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌పై ఏకంగా శాశ్వత ప్రాతిపదికన మలిగీలను నిర్మించుకుని వ్యాపారాలు కొనసాగించటం, అలాగే నిత్యం రద్దీగా ఉండే రోడ్డును సగం వరకు కబ్జా చేసుకుని అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నా, కనీసం ప్రశ్నించే నాథుడే కరవయ్యాడు. ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటి ప్రచార సామాగ్రిని తొలగించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాటికి స్థానిక పోలీసుల సహకారాన్ని ఏర్పాటు చేసినా, పాతబస్తీలో ఆశించిన స్థాయిలో ఆక్రమణలను తొలగించకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఓల్డ్‌సిటీతో పాటు న్యూ సిటీలోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్లు చెప్పిన ఆక్రమణలను మాత్రమే అధికారులు తొలగిస్తున్నారని, అయితే తమకు మాముళ్లు చెల్లించని చిరువ్యాపారులపై కార్పొరేటర్లు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం లేకపోలేవు. గతంలో కూడా ఇదే తరహాలో ఆక్రమణలు, సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించేందుకు చేపట్టిన చర్యలు కేవలం న్యూ సిటీకే పరిమితమయ్యేవని, ఇపుడు స్వరాష్ట్రం, స్వపరిపాలనలో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న పాలకులు ఈ రకమైన వివక్ష చూపటం దారుణమన్న వాదనలున్నాయి.