తెలంగాణ

మత్స్య సాగు విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: మత్స్య పరిశ్రమాభివృద్ధికి కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకంపై అవసరమైన కార్యాచరణ యుద్ధప్రాతిపదికన రూపొందించాలని ప్రగతి భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ప్రతి చెరువు చేపల పెంపకానికి ఉపయోగపడాలని, గొర్రెలు, పాడి సంపదతో రాష్ట్రం అగ్రగామిగా నిలవాలని సూచించారు. హైదరాబాద్ వినా మిగిలిన 30 జిల్లాల్లో గొర్రెల పంపకం, పెంపకం ఒకేసారి చేపట్టాలన్నారు. చేపలు, గొర్రెలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి
చేరుకోవాలన్నారు. మత్స్య పరిశ్రమను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బేస్తలతోపాటు ముదిరాజ్, గంగపుత్రులు, బోయలు, కురమ యాదవ తదితరులు మత్స్య పరిశ్రమపై ఆధారపడుతున్నారని, వీరికి సంబంధించి సమగ్ర సమాచారం సేకరించాలన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అనువైన స్థలాలను ఎంపికచేసి ఫిషరీస్ కళాశాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్య కార్మికులకు, గొర్రెల పెంపకందార్లకు సొసైటీలు స్థాపించాలని , ఈ వృత్తిలోని ఇతర కులాలవారినీ సొసైటీల్లో సభ్యులు చేయాలని సూచించారు. రాజకీయాలకు తావులేకుండా సొసైటీల నిర్మాణం ఉండాలన్నారు. మార్కెటింగ్ ప్రతినిధులు రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రదేశాల్లో పర్యటించి చేపల అమ్మకాల ద్వారా అధిక లాభాలు పొందే వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. ఈ విషయంలో అంకాపూర్ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకోవాలన్నారు. సముద్ర తీరంలేని ప్రాంతాల్లో చేపల మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువని, ఈ విషయంపై దృష్టి పెట్టాలన్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పధకాలు, ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా చిన్న, మధ్యతరహా, భారీ రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఏడాది పొడవునా ఉంటుందని, ఈ అనుకూల పరిస్థితిని చేపల పెంపకానికి ఉపయోగించాలని సిఎం సూచించారు. రాష్టవ్య్రాప్తంగా సుమారు 46 వేల పైచిలుకు చెరువులను ప్రాజెక్టుల ద్వారా నింపుకోనున్నందున తెలంగాణలోని ప్రతి చెరువూ చేపల ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని కెసిఆర్ సూచించారు. మత్స్య పరిశ్రమకు సంబంధించినంత వరకూ ప్రతి చెరువునూ మత్స్య శాఖ ఆధీనంలో ఉంచాలని ఆదేశించారు. ఫిష్ సీడ్ పెంచడానికి రాష్టవ్య్రాప్తంగా అనువైన స్థలాలు ఎంపిక చేయాలని చెప్పారు.
పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై సిఎం కెసిఆర్ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో నిత్యం అవసరమయ్యే పాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేకుండా రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయడానికి అనువైన వ్యూహం రూపొందించాలన్నారు. పాల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పశు సంవర్థక శాఖకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఉన్నాయని, వీటిని గొర్రెల మార్కెటింగ్ కోసం వినియోగించాలన్నారు. భవిష్యత్‌లో పశు సంవర్థక శాఖ ప్రాధాన్యత గణనీయంగా పెరగనుందని, దానికి తగ్గట్టు ఉద్యోగుల నియామకాలు కూడా ఉంటాయని కెసిఆర్ వెల్లడించారు. పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖల్లో ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని సూచించారు.
మత్స్య కార్మికులకు, గొర్రెల పెంపకందారులకు మనోధైర్యం కలించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సాంస్కృతిక సారథి ద్వారా లఘుచిత్రాలు, పాటలతో సిడీలు రూపొందించి చైతన్యం తేవాలని సూచించారు. తాను స్వయంగా ప్రగతి భవన్‌లో జనహిత సమావేశ మందిరంలో మత్స్య కార్మికులు, గొర్రెల పెంపకందార్లతో దశలవారీగా సమావేశమవుతానని కెసిఆర్ ప్రకటించారు. అదేవిధంగా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

చిత్రం... మత్స్యసాగుపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న కెసిఆర్