హైదరాబాద్

ఇష్టారాజ్యంగా తవ్వేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: మహానగరంలో రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వటాన్ని నిరసిస్తూ బిజెపి శాసనసభ పక్ష నేత కిషన్‌రెడ్డి సోమవారం జిహెచ్‌ఎంసి కార్యాలయం ముందు బైఠాయించారు. ఉదయం జిహెచ్‌ఎంసి ఆఫీసుకు చేరుకున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మెయిన్ గేటు ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఓ వైపు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ నగరవాసులు లబోదిబోమంటుంటే మరో వైపు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. నగరంలో ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు తెలియకుండానే రోడ్లను ఎలా తవ్వుతారని ఆయన ప్రశ్నించారు. రోడ్డు కట్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చేస్తున్న ప్రకటనలు క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం అమలు కావటం లేదని ఆరోపించారు. ముఖ్యంగా తాను మూడురోజులు దిల్లీకి వెళ్లి వచ్చే సరికి అంబరేపేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు మిషన్లతో 30 ప్రాంతాల్లో రోడ్లు ఇష్టమొచ్చినట్లు తవ్వేశారని ఆరోపించారు. అధ్వాన్నమైన రోడ్లతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు రోడ్ల రీ కార్పెటింగ్ కొంత వరకు ఉపశమనం కల్గించినా, ఓ ప్రైవేటు సంస్థ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నా, జిహెచ్‌ఎంసి అధికారులెందుకు ప్రక్షక పాత్ర వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆ ప్రైవేటు సంస్థతో అధికారులేమైనా కుమ్మక్కయ్యారా? అని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి జిహెచ్‌ఎంసి ముందు బైఠాయించారన్న సమాచారం తెలియటంతో బిజెపి పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.

ప్రజావాణి విజ్ఞప్తులను
త్వరితగతిన పరిష్కరించాలి

హైదరాబాద్, జనవరి 9: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేదిశంగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అన్నారు. సోమవారం ప్రజావాణీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల పేమెంట్, జెఎన్‌ఎన్‌యుఆర్‌యం, ఇళ్ల కేటాయింపులు, పెన్షన్లు, భూసమస్యలు, ఆహార భద్రత కార్డులు, రుణ మంజూరు వంటి 59 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, సిపిశ వైవి శర్మ పాల్గొన్నారు.
ఎక్స్‌గ్రేషియా
యాచారం మండలంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన ముప్పిడి ఈశ్వరమ్మ (37) 2007లో హత్యకు గురైంది. కొందరు వ్యక్తులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అప్పట్లో నమోదైంది. చార్జిషీట్ అయిన సందర్భంలో ఆమె భర్త అంజయ్యకు కు రూ.1.5లక్షలు అందజేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలుబడింది. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.50వేలు మూడు నెలల సరిపడ ఆహార ధాన్యాల కోసం మరో పదివేలు ఎక్స్‌గ్రేషియాను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునంధన్‌రావు అందజేశారు.