హైదరాబాద్

ఇప్పట్లో లేనట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: 625 చ.కి.మీల విస్తర్ణం..18 సర్కిళ్లు, అయిదు జోన్లుగా ఉన్న మహానగర పాలక సంస్థ సర్కిల్, జోనల్ స్థాయి అధికారుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు రెండేళ్ల క్రితం ప్రారంభించిన ప్రయత్నాలు అర్థాంతరంగా ఆగిపోయాయ. మహానగర పాలక సంస్థ పేరుకుతగిన విధంగానే ఆధునిక హంగులు సమకూర్చుకోవాలని భావించినా, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం వెంటాడుత్నునందున ఇప్పట్లో బల్దియా వీడియో కాన్ఫరెన్స్‌లను ప్రారంభించే పరిస్థితుల్లో లేదనే చెప్పవచ్చు. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ సేవలను ఆన్‌లైన్ చేసిన ఉన్నతాధికారులు ఇకపై సర్కిళ్లు, జోన్ల అధికారులతో ఎప్పటికపుడు పనులు, పరిపాలనపరమైన అంశాలే గాక, ప్రజాసమ్యల పరిష్కార తీరును తెల్సుకునేందుకు ఎప్పటికపుడు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత కమిషనర్ బదిలీ కావటంతో ఈ ప్రతిపాదన మూలనపడింది. ర్కిళ్లను జోనల్ స్థాయికి అసనుంధానం చేసి, ఈ రెండింటిని కలిపి హెడ్డ్ఫాసులోని కమిషనర్ ఛాంబర్‌కు, అలాగే వివిధ విభాగాధిపతులకు అనుసంధానం చేసేలా గతంలో స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసే బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయనా బదిలీ అయి వెళ్లిన తర్వాత ఈ ప్రతిపాదనను ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం గ్రేటర్ బల్దియాలో ప్రతి సోమవారం వైద్య, ఆరోగ్య విభాగంపై, అలాగే ప్రతి నెల మొదటి శనివారం ఒక్కో ప్రభుత్వ శాఖ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం, విభాగాల వారీగా తరుచూ సమీక్షలు ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తుండటంతో సర్కిళ్ల నుంచి అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు, జోనల్ కమిషనర్ల గంటల కొద్ధీ సమయం వృథా అవుతోంది.
ఫలితంగా వారు సర్కిల్, జోన్ల కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలను నివారించేందుకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తే అధికారుల సమయం చాలా వరకు ఆదా అవుతుందని భావించి, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినా, అవి నీటికీ ఫలించలేదు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి ఆస్తిపన్ను వసూళ్లు జోరుగా సాగే డిసెంబర్ నుంచి మార్చి వరకు, అలాగే వినాయక నిమజ్జనం, బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లు వంటి ముఖ్యమైన సమయాల్లో సిబ్బంది, అధికారులపై కూడా పనిభారం తగ్గుతోంది. వీలైనంత త్వరగా వీడియో కాన్ఫరెన్స్‌లను అందుబాటులోకి తెచ్చుకుంటే సర్కిల్, జోనల్ స్థాయి అధికారుల సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది.
వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసే వ్యవస్థ కోసం ప్రస్తుతం హడావుడిగా కసరత్తు చేస్తున్న అధికారులు గతంలో అన్ని సర్కిళ్లు, జోనల్ కార్యాలయాల్లో సిబ్బంది పనితీరు, రాకపోకలను గమనించేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ కోసం చేస్తున్న ప్రయత్నం ముందుకు సాగకపోవటం గమనార్హం.
ఇందుకోసం ప్రత్యేకంగా ప్రైవేటు సిబ్బందిని నియమించుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇప్పటికే 23500 మంది ఔట్‌సోర్సు కార్మికులకు సంవత్సరానికి రూ. 53.64 కోట్లను జీతాలుగా చెల్లిస్తున్న బల్దియాకు ఇది పెద్ద భారమేమీ కాకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.