హైదరాబాద్

ఆకట్టుకున్న ‘స్లేట్’ వార్షికోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: పిట్ట కొంచెం..కూత ఘనం అని తమ సత్తాచాటారు స్లేట్ ది స్కూల్ ఆబిడ్స్ బ్రాంచి విద్యార్థులు. స్కూల్ వార్షికోత్సవాలంటే వార్షిక నివేదికల సమర్పణ, రాజకీయ, విద్యా ఇతర రంగాల ప్రముఖుల ప్రసంగాలే సహజం. కానీ ఇందుకు భిన్నంగా, వినూత్నంగా స్కూల్ వార్షికోత్సవాలు నిర్వహించింది ‘స్లేట్ ది స్కూల్’ ఆబిడ్స్ శాఖ. మంగళవారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని తెలుగు లలితకళాతోరణంలో స్లేట్ స్కూల్ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా నిర్ణయించిన సమయానికి సరిగ్గా అయిదు గంటలకు ఎలాంటి ఆర్భాటం లేకుండా సీదాసాదాగా ప్రారంభమైన వార్షికోత్సవంలో భాగంగా చిన్నారుల ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు అయిదు గంటల పాటు ఏకధాటిగా సాగిన చిన్నారులు వైవిధ్య భరితమైన ఈ నృత్యరూపకాల్లో ఎక్కడా కూడా పాశ్చాత్య సంస్కృతికి తావులేకుండా సాంప్రదాయ రీతిలో ప్రదర్శనలిచ్చారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రద్దీతో కళాతోరణం కిక్కిరిసింది. ఎలాంటి ప్రసంగాలకు తావులేకుండా చిన్నారుల ప్రతిభకు పట్టం కడుతూ పాఠశాల నిర్వాహకులు నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి, గురుభక్తిని చాటిచెప్పాయి. అంతేగాక, విద్యార్థులు రాణించాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్రను తెలియజేస్తూ ప్రదర్శించిన నాట్య ప్రదర్శన ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేసింది. ముఖ్యంగా బట్టీకొట్టి చదువుకునే విద్యార్థులు పరీక్ష సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకద్దినట్టు విద్యార్థులు ప్రదర్శించిన లఘునాటిక ఆహూతులను కడుపుబ్బ నవ్వించింది. యాక్టు లోకల్..్థంక్ గ్లోబల్ అన్న స్వామి వివేకానంద సూక్తిని అనుసరిస్తూ విద్యార్థులు మన భారత సంస్కృతీ, సంప్రదాయాల ఔన్నత్యాన్ని చాటిచెబుతూనే ఇతర దేశాల్లో భారతీయులను కించపరిచే తీరును, జాతి వివక్షతో పాటు అమెరికా సామ్రాజ్యవాదాన్ని కూడా తమ ప్రతిభాపాటవాలతో ఎత్తిచూపారు. విభిన్నకులాలు, మతాలు, భాషాసంస్కృతులకు నిలయమైన భారతదేశం, యురోపియన్ సంస్కృతి మధ్యనున్న వ్యత్యాసాలను విద్యార్థులు తమ కళాప్రతిభతో నృత్యాభినయంతో ప్రతిభింభించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుకు జోహార్లు అర్పిస్తూ చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలంకరణతో ఇచ్చిన ప్రదర్శన కలర్‌ఫుల్‌గా నిల్చింది. అలెగ్జాండర్ మొదలుకుని హిట్లర్, ముస్సోలిని దాకా హింసా, ప్రతీకారం, రాజ్య విస్తరణ దారిలో శే్వతజాతి దూసుకెళ్తుంటే, బుద్దుడు మొదలుకుని గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ దాకా ప్రేమ తత్వాన్ని భోధించటం ఒక్క భారతీయులకే సాధ్యమైందన్న గొప్ప వాస్తవానికి విద్యార్థుల తమ ప్రదర్శనలో చాటారు. వార్షికోత్సవాలకు స్కూల్ చైర్మన్ వాసిరెడ్డి అమర్‌నాథ్ హజరై ప్రదర్శనలను తిలకించి, విద్యార్థులను అభినందించారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘ఓ నాన్నా..’
సాంస్కృతికోత్సవంలో భాగంగా స్లేట్ స్కూల్ ఆబిడ్స్ విభాగం విద్యార్థులు ఓ నాన్నా..అంటూ సాగిన పాటపై ప్రదర్శించిన నృత్యరూపకం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాన్స్ టీచర్ మానస ఆధ్వర్యంలో మూడో తరగతి విద్యార్థి కార్తీక్ బృందం ప్రదర్శించిన ఈ నృత్యరూపకం జీవితంలో మరువలేని నాన్న లాలన, పాలనను సభికులకు మరోసారి గుర్తుచేసింది. ఆ తర్వాత గురు ప్రాముఖ్యత, దేశభక్తిని చాటుతూ జిస్ దేశ్ మే గంగా బహేతీహై..గురును ఆరాధిస్తూ కొనసాగిన నృత్యరూపకానికి తోడు బుద్దుడు, గురునానక్, గరుగోవింద్ సింగ్ భోధనలతో పాటు పుణ్యభూమి నా దేశం..అంటూ సాగిన ప్రదర్శనలు ఈ సాంస్కృతికోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.