హైదరాబాద్

కొత్త కొత్తగా.. లక్ష్యం దిశగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: జిహెచ్‌ఎంసి సమావేశమంటే పెద్ద హోటల్‌లో గానీ, ప్లాజాలో గానీ నిర్వహించేవారు. కానీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఇపుడు సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరుబయట సమావేశం నిర్వహించటంతో పాటు ఇదివరకు మాదిరిగా కాకుండా కాస్త రొటీన్‌గా లంచ్ సమయంలో అధికారులందరికీ రూ. 5 భోజనం ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు ఏసి గదుల్లో, పెద్ద పెద్ద స్టార్ సమావేశ మందిరాల్లో సమావేశాలు నిర్వహించిన అధికారులు ఇపుడు సెవెన్ టూంబ్స్ ఆవరణలో చెట్టుకింద ఆహ్లాదకరమైన వాతావరణంలో సమావేశమయ్యారు. దీంతో పెద్ద ఎత్తున నిధులను కూడా ఆదా చేయటంతో పాటు అధికారులు కూడా చక్కటి వాతావరణంలో కాస్త రిలాక్స్ అయ్యారు.
అంతేగాక, ఈ సమీక్షకు హాజరైన అధికారుల్లో సగం మంది నిత్యం పనిభారంతో ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటామని, మొట్టమొదటి సారిగా తాము కులీకుతబ్‌షాహీ టూంబ్స్ చూశామన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు టూంబ్స్‌లను సందర్శించిన బ్రిటన్‌కు చెందిన పర్యాటకుల జంట జాన్, పాలీలను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి అనుభవాలను అధికారులు తెల్సుకున్నారు. గతంలో 1969లో హైదరాబాద్‌ను తొలిసారిగా సందర్శించామని, తిరిగి 2017లో సందర్శిస్తున్నామని వారు తెలిపారు. పారిశుద్ధ్య పరంగా నగరం మెరుగైనప్పటికీ పర్యాటక ప్రాంతంలో రహదారులు, మార్గాలు మరింత విస్తరించాల్సిన అవసరముందని వారు సూచించారు.
సందర్భంగా టూంబ్‌లను తిలకించేందుకు వచ్చిన లాలాపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు డబుల్ డస్ట్‌బిన్లను పంపిణీ, తడి, పొడి చెత్తను వేర్వేరు చేయటంపై వీరికున్న అవగాహనను కమిషనర్ అడిగి తెల్సుకున్నారు.
పారిశుద్ధ్యంలో మనమే ఫస్ట్ ఉండాలి : కమిషనర్ జనార్దన్ రెడ్డి
పారిశుద్ధ్యంలో దేశవ్యాప్తంగా జిహెచ్‌ఎంసి మొదటి స్థానంలో ఉండాలని, ఇందుకు సమష్టి కృషి అవసరమని కమిషనర్ జనార్దన్ రెడ్డి టూంబ్స్‌లో ఆరుబయట ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన నగరంలో సుమారు 22వేల మంది పారిశుద్ధ్య కార్మికులున్నారని వివరించారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునేందుకు వీరంతా కలిసిమెలిసి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. చెత్తను తరలించేందుకు స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేసినా, ఇంటింటికి సుమారు 44లక్షల డస్ట్‌బిన్లను పంపిణీ చేసినా, తడి,పొడి చెత్తను వేర్వేరు చేయటంలో సఫలీకృతులం కాలేకపోయామని వ్యాఖ్యానించారు.