హైదరాబాద్

ఎపుడెపుడు ఏం చేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: మహానగర పాలక సంస్థ ఏడాది పొడువునా చేపట్టాల్సిన పనులు, వౌలిక వసతుల నిర్వాహణ కోసం ప్రత్యేకంగా ఓ కార్యచరణను రూపొందించేందుకు కసరత్తుప్రారంభించింది. ముఖ్యంగా మూడు సీజన్లలో నగరంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఈ కార్యాచరణ ఉపయోగపడేలా రూపొందించాలన్న మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా బుధవారం మొట్టమొదటి సమావేశం కూడా జరిగింది. ఇందులో ముఖ్యంగా వర్షాకాలం ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసేందుకు గాను ఏడాది పొడువునా నాలాల పూడికతీత పనులను చేపట్టేందుకు, అలాగే వర్షాకాలం ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు నివారించేందుకు ఆ కాలానికి ముందే చేపట్టాల్సిన పనులను ఈ కార్యాచరణలో పొందుపరిచేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి అధికారులు ఎండాకాలం ముగిసే లోపు నాలాల పూడికతీత పనులను తొలగించాలన్న లక్ష్యంతో పనులు చేపట్టేవారు. కొన్ని సార్లు ఎండాకాలం ముగిసినా, నాలాల్లో పూడికతీత పనులు పూర్తికాని సందర్భాలుండటం, ఆ తర్వాత భారీ వర్షాలు కురవటంతో నాలా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురి కావటం వంటి సమస్యలు తలెత్తేవి. గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నగరంలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలు, బండారీ లే అవుట్‌లోని భవనాల్లోకి భారీగా వరద నీరు చేరిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో నాలాల పూడికతీత పనులను కేవలం ఎండాకాలానికే పరిమితం కాకుండా ఏడాది పొడువున చేపడితే, వాటిలో నీరు మరింత సజావుగా, ఎలాంటి అడ్డంకల్లేకుండా ప్రవహించే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే రోడ్లకు సంబంధించి కూడా నిర్వహణను ఏడాది పొడువునా బల్దియా చేపడుతోంది. అయితే కొత్తగా రూపొందించనున్న కార్యాచరణ ప్రకారం వర్షాకాలానికి ముందే రోడ్లను పకడ్బందీగా రీకార్పెట్ చేయాలన్న పలు అంశాలతో ఈ కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
దీంతో పాటు జిహెచ్‌ఎంసికి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్నును ఏడాది పొడువున వసూలు చేసుకోవల్సి ఉన్నా, పన్ను వసూళ్ల కలెక్షన్‌ను అధికారులు కేవలం ఆర్థిక సంవత్సరంలోని చివరి మూడు నెలలైన జనవరి నుంచి మార్చి వరకే పరిమితం చేస్తూ వచ్చారు. ఇలా కాకుండా వేగంగా నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికపుడు కొత్త నిర్మాణాలను ఆస్తిపన్ను పరిధిలో తీసుకురావాలన్న అంశాన్ని కూడా ఈ కార్యచరణలో చేర్చనున్నారు. దీంతో పాటు అభివృద్ధి పనుల్లో నాణ్యత, కాంట్రాక్టు సంస్థలకు జవాబుదారి తనాన్ని పెంపొందించటం వంటి ముఖ్యమైన అంశాలతో జిహెచ్‌ఎంసి ఏడాది పొడువున అమలు చేయాల్సిన కార్యచరణను తయారు చేయాలని భావిస్తోంది.