హైదరాబాద్

మానవరహిత పారిశుద్ధ్యంపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: మ్యాన్ హోల్‌లోకి కార్మికులు ప్రవేశించి పారిశుద్ధ్య పనులు చేయకుండా నివారించాలని, ప్రయత్నాలు చేసినప్పటికి చాలామంది ప్రైవేట్ కాంట్రాక్టర్లు, గృహా యాజమానులు ఇతర ప్రైవేట్ కార్మికులతో పనులు చేయించి, జరిగే ప్రమాదాలకు, మరణాలకు కారణమవుతున్నారని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ తెలిపారు. సఫాయి కర్మాచారి ఆందోళన్ జాతీయ కమిషన్ అధ్యక్షుడు, మెగసేసే అవార్డు గ్రహీత బెజావడ విల్సన్‌తో జలమండలి ఎండి బుధవారం సమావేశమయ్యారు. మ్యాన్‌హోల్స్, డ్రైనేజీ పైప్‌లైన్‌లలోకి పారిశుద్ధ్య కార్మికులు ప్రవేశించడాన్ని నివారించే దిశగా చేపట్టాల్సిన కార్యచరణపై, ఇతర అంశాలపై చర్చించారు. ఖైరతాబాద్‌లోని జలిమండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో సఫాయి కర్మాచారి ఆందోళన్ పెద్ద ఎత్తున నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఎండి తెలిపారు. మ్యాన్‌హోల్‌లోకి కార్మికులు ప్రవేశించడాన్ని నివారించడానికి సివిల్ సోసైటీ ఆర్గనేజేషన్, సామాజిక, మనవ హక్కుల కార్యకర్తలతో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని బెజవాడ విల్సన్‌ను దానకిషోర్ కోరారు. కార్మికులు మ్యాన్‌హోల్‌లోకి దిగడాన్ని నివారించడంతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై జలమండలి కార్మికులకు అవగాహన పెంపొందించాలని ఎండి కోరారు. సిటిజన్ చార్టులు, పర్యవేక్షణ కమిటీలు, సామాజిక అవగాహన కమిటీల సాయంతో క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా కార్యక్రమాలు చేపట్టాలని విల్సన్‌ను ఎండి దానకిషోర్ కోరారు. సమావేశంలో సఫాయి కర్మాచారి ఆందోళన్ కోర్ టీమ్ మెంబర్ డాక్టర్ దీప్తిసుకుమార్, బాషా సింగ్, వాష్ ఎన్‌జిఓ ప్రతినిధి స్నేహలత, జలమండలి పిఅండ్‌ఎ విభాగం డైరెక్టర్ అజ్మీరాకృష్ణ, టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ పాల్గొన్నారు.