హైదరాబాద్

పనులను సకాలంలో పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: నగర శివారు ప్రాంతాల్లో చేపడుతున్న తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనులను సకాలంలో పూర్తి చేయాలని జలమలండలి ప్రాజెక్ట్ విభాగం డైరెక్టర్ ఎం.ఎల్లస్వామి ఆదేశించారు. నగర శివారు ప్రాంతాల్లో రూ.1900 కోట్ల వ్యయంతో చేపడుతున్న తాగు నీటి సరఫరా మెరుగు పథకం పనుల పురోగతిపై ప్రాజెక్ట్ డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి ప్రాజెక్ట్ విభాగం సర్కిల్-3 పరిధిలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, కుత్భుల్లాపూర్ మున్సిపల్ పరిధిలో చేపడుతున్న వాటర్ రిజర్వాయర్ల నిర్మాణం, నీటి పైప్‌లైన్ల ఏర్పాటు వంటి అంశాలపై డివిజన్‌ల వారీగా ప్రాజెక్ట్ విభాగంకు చెందిన అధికారులను డైరెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పైప్‌లైన్ త్వకాలు, రిజర్వాయర్ల నిర్మాణం విషయంలో అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్లస్వామి సూచించారు. తెంలగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగు పథకం పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపడుతోంది. జలమండలి సర్కిల్-3 పరిదిలోని శేరిలింగంపల్లి, పటాన్‌చేరు, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్‌కు సంబంధించి రూ.559 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీటిలో ప్రధానంగా 21 రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు 610 కిలో మీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నారు. జలమండలి ప్రాజెక్ట్ వినాగం సిజిఎం-3 రామచంద్రరెడ్డి పర్యవేక్షణలో పలువురు జనరల్ మేనేజర్లు నిర్మాణంలో పనుల స్థితి గతులపై సమీక్షలో డైరక్టర్‌కు వివరించారు. సమీక్ష సమావేశంలో సిజిఎం రామచంద్రరెడ్డితో పాటు జిఎం, డిజిఎం, మేనేజర్‌లతో పాటు మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ప్రాజెక్ట్ ఇన్‌చార్జి సయ్యద్ నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు.