హైదరాబాద్

‘బేటీ బచావో..బేటీ పడావో’ ఆచరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జనవరి 15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినదించిన ‘బేటీ బచావో..బేటి పడావో’ ఆచరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా బిజెపి మహిళామోర్చా ఆధ్వర్యంలో దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య పాఠశాలలో నిర్వహించిన ముగ్గులపోటీలో పాల్గొని మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. విజేతలు రోహిణి, సువర్ణ, వనజకు బహుమతులను పింపిణీ చేసి అభినందించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలన్నారు. సంక్రాంతి రోజు పల్లె వాతావరణం పట్టణాల్లో కనిపిస్తుండటం మంచి అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. మహిళామోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ మాట్లాడుతూ చసక్కల ముగ్గులు, సందేశాత్మక ముగ్గులు అంశంగా పోటీలు నిర్వహించనట్లు తెలిపారు.
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
చేవెళ్ల, జనవరి 15: అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఓ ట్రాక్టర్‌ను పట్టుకొని చేవెళ్ల పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పిఎస్సై వరప్రసాద్ తెలిపారు. చేవెళ్ల మండలం ఊరేళ్ల గ్రామంలోని వాగులో ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పోలీసులకు అందిన సమాచారంతో వెంటనే అక్కడికి వెళ్లి ట్రాక్టర్‌ను స్వాధీనం సీజ్ చేశారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఓయు ఠాణా పరిధిలో
వృద్ధురాలి హత్య
సికిందరాబాద్, జనవరి 15: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి నగదుతో పరారైన నిందితున్ని అదుపులోకి తీసుకుని సంఘటన వివరాలను ఈస్ట్‌జోన్ డిసిపి డాక్టర్.వి.రవీందర్, కాచిగూడ ఏసిపి లక్ష్మీనారాయణ ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. బోడుప్పల్, అశోక్‌నగర్ కాలనీకి చెందిన సిద్దం సాయిప్రసాద్ (26) వృత్తిరీత్యా ఎసి మెకానిక్, ఏడవ తరగతి వరకు చదువుకున్న ఇతనికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగినప్పటికి చెడు వ్యవసనాలతో భార్య వదిలి వెళ్లిపోయింది. ఇంట్లో తండ్రి అన్నయ్యలు కూడ పట్టించుకోవడం మానేశారు. కాగా నిందితుడు సంపాదన కన్నా అధికంగా వ్యసనాలకు ఖర్చు చేస్తూ బానిసయ్యాడు. ఈదశలో ఈ నెల 13న మాణికేశ్వర్‌నగర్ నగర్‌లోని ఇతని స్నేహితుడు కన్నయ్యను కలవడానికి వచ్చాడు. స్నేహితుడు ఇంట్లో లేకపోవడంతో ప్రక్కనే సీతాఫల్‌మండి ప్రాంతంలోని ఓ ఇంటి ముందు సిగరెట్టు కొని కాలుస్తూ అటు ఇటూ తిరుగుతుండడంతో ఆ ఇంట్లో నివసించే నండూరి ఇంద్రాదేవి అనే వృద్దురాలు తీవ్రంగా మందిలించడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. దీంతో ఆగ్రహించిన వృద్దురాలు నిందితునిపై నీళ్లు కూడ పోసింది. గొడవను ప్రక్కనే ఉన్న మరో వ్యక్తి కూడ గమనించి మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన నిందితుడు ప్రతీకారంతో రగిలిపోయాడు. సదురు మహిళ ఒంటరిగానే ఉంటుందని, అతనితో ఓ అబ్బాయి ఉన్నా అతను మూగవాడని తెలుసుకుని పథకం పన్నాడు. వెంటనే గంట వ్యవధిలో దాదాపు 3.30 గంటల సమయంలో తిరిగి వచ్చి నేరుగా బాధితురాలు ఉంటున్న మొదటి అంతస్తులోని ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. నిందితున్ని గమనించిన బాధితురాలు అరవడానికి ప్రయత్నం చేయడంతో మంచం మీద ఉన్న దిండును తీసుకుని తలపై గట్టిగా అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. బాధితురాలు చనిపోయినట్లు తెలుసుకున్న తర్వాత దిండు క్రింద ఉన్న బీరువా తాళం చేతులు తీసుకుని తాళం బీరువాను తెరిచి బట్టలు సామాన్లు చిందర వందర చేసి అందులో ఉన్న రు.36వేల నగదును, హాల్‌లో ఉన్న వీడియోకాన్ ఎల్‌సిడిని తీసుకుని తాఫీగా వెళ్లిపోయాడు. అటు నుంచి నేరుగా తార్నాక బిగ్‌బజార్‌కు వెళ్లి కొత్త సెల్‌ఫోన్‌ను కొనుగోలు చేసి వెళ్లిపోయాడు. హత్య విషయం తెలుసుకున్న ఓయు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి క్లూస్‌టీంను రప్పించి క్షణ్ణంగా తనిఖీలు చేశారు. ఒక వ్యక్తి ఉదయం 11 గంటల సమయంలో వీధిలో అనుమానస్పదంగా తిరిగినట్లు, వృద్దురాలితో ఓ వ్యక్తి గొడవపడినట్లు తెలుసుకున్నారు. గాలింపులో భాగంగా పోలీసులకు ఓ మూల చిన్న మెమొరీకార్డు లభించడంతో వివరాలను కూఫీలాగారు. అదే సమయంలో నిందితుడు ఆదివారం ఉదయం ఇఫ్లూ ప్రాంతంలో తన మిత్రుడిని కలవడానికి వస్తున్న సమయంలో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని అతని నుంచి రు.21వేల నగదును, వీడియోకాన్ ఎల్‌సిడి టివిని, కొత్త సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కాగా కేసును కాచిగూడ ఏసిపి లక్ష్మీనారాయణ నేతృత్వంలో మూడు గంటల్లో చేదించి, 24 గంటల్లో నిందితున్ని అదుపులోకి తీసుకున్న ఓయు అదనపు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణను, సహకరించిన ఎస్‌ఐలు సైదులు, రామకృష్ణ, శ్రీకాంత్‌ను డిసిపి డాక్టర్.వి.రవీందర్ అభినందించి రివార్డులు అందించనున్నట్లు పేర్కొన్నారు.