హైదరాబాద్

సాగర తీరానికి మరిన్ని సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 15: విశ్వనగర నిర్మాణంలో భాగంగా హుస్సేన్ సాగర్‌కు మరిన్ని సొబగులు సమకూర్చాలని హెచ్‌ఎండిఎ భావిస్తోంది. సాగర తీర ప్రాంతాలను సుందరీకరించి అందంగా తీర్చిదిద్దేందుకు కార్యచరణ రూపొందిస్తోంది. సాగర్ చుట్టూ 14 కిలోమీటర్లు సుందరీకరణ పనులతో పాటు సంజీవయ్య పార్క్‌లో ఖాళీగా ఉన్న ప్రాంతంలో ల్యాండ్ స్కేపింగ్ చేయడానికి సన్నాహాలు హెచ్‌ఎండిఎ చేస్తోంది. ల్యాండ్ స్కేప్‌లో పేరుగాంచిన ముంబై ఆర్కిటెక్ట్ కిషోర్ డి పార్ధన్‌తో ఇంజనీర్లు చర్చలు జరిపి నగరానికి తీసుకువచ్చారు. ఇటీవలే హెచ్‌ఎండిఎ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్‌రెడ్డి, ఎస్‌ఇ మాజీద్ షరీఫ్, ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్లు పరంజ్యోతి, కృష్ణారావు కిషోర్‌తో సాగరతీరాన సుందరీకరణపై విస్తృతంగా చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను అధికారులను తెలుసుకున్నారు. ఎన్‌టిఆర్ గార్డెన్, సాగర్ పార్కు, సంజీవయ్య పార్క్, వాక్‌వేలను సందర్శించిన వారికి సంజీవయ్య పార్క్‌లో ఖాళీగా ఉన్న స్థలంలో ల్యాండ్ స్కేపింగ్ చేసే అవకాశం ఉందని ఆర్కిటెక్టర్ కిషోర్ తెలిపారు. పివి ఘాట్, నెక్లెస్ రోడ్ రైల్వేట్రాక్, జలవిహార్ వద్ద నున్న 21 ఎకరాలు అభివృద్ధికి దూరంగా ఉందని గుర్తించారు. సుందరీకరణ పనులపై పాజెక్ట్ రిపోర్టును ఈ నెలాఖరులోగా కిషోర్ అందజేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

నిబంధనల ప్రకారమే హెచ్‌సిఎకు పోటీ
స్పష్టం చేసిన శేషు నారాయణ
ఖైరతాబాద్, జనవరి 15: లోధా కమిటీ చేసిన సూచనలు, సిఫార్సులకు లోబడే తమ ప్యానెల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ఎన్నికల్లో బరిలో దిగుతున్నట్టు కార్యదర్శి పదవికి పోటీపడుతున్న శేషు నారాయణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెచ్‌సిఎను వివాదాల కేంద్రంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ అనర్హుడని నిబంధనలను స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కానీ, ఆయన అసలు విషయాన్ని పక్కకుపెట్టి, విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. విమర్శలు చేసే ముందు అన్ని తెలుసుకొని మాట్లాడాలని అజర్‌కు శేషు నారాయణ సూచించారు. గతంలో హర్షద్ అయూబ్‌ను విమర్శించిన అజర్ ఇప్పుడు మాట మార్చాడని ఆరోపించారు. అప్పట్లో అయూబ్‌పై నిప్పులు చెరిగిన అతను ఇప్పుడు ఆ శిబిరంలో చేరి, ఇతరులపై విమర్శలు గుప్పించడం సరికాదని వ్యాఖ్యానించారు. హెచ్‌సిఎకు ఎప్పుడో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, వాయిదా వేస్తూ వచ్చిన వారే అనవసర ఆరోపణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. వివేక్ ఇప్పుడు మంత్రి పదవిలో లేరని, కాబట్టి ఆయన పోటీ చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. న్యాయస్థానం సూచించిన మేరకు, ప్రజాస్వామ్య బద్ధంగా ఈనెల 17న ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.