హైదరాబాద్

మైనర్లపై పెరుగుతోన్న లైంగిక దాడులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: హైదరాబాద్ నగరంలో మైనర్ బాలికలపై రోజురోజుకూ లైంగిక దాడులు పెరుగుతున్నాయి. మైనర్ల కిడ్నాప్, అత్యాచారాలు, హత్యలు, గృహహింస వంటి కేసులు గత ఐదేళ్లతో పోలిస్తే ఏడు రెట్లు పెరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ఇటీవల విడుదల చేసిన డేటాలో పేర్కొంది. 2014 వరకు 52 కేసులు నమోదు కాగా, 2016 అక్టోబర్ నాటికి 367 కేసులు నమోదయ్యాయి. మైనర్లపై లైంగిక దాడులు పెరగడానికి గల కారణం, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు శాంతి భద్రతలు పర్యవేక్షించే పోలీసులపై ఆధారపడి ఉంటాయని నేర పరిశోధనా విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మైనర్లపై జరిగిన దాడులు పరిశీలిస్తే 2011-15 వరకు ప్రీవెన్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెనె్సస్ (పిఓసిఎస్‌ఓ) చట్టం కింద మొత్తం 1,031 కేసులు నమోదయ్యాయి. గత ఐదేళ్లలో మైనర్లపై జరిగిన దాడులను పరిశీలిస్తే..
2012లో 94 కేసులు నమోదుకాగా, వీటిలో 25 కిడ్నాప్, 32 లైంగిక వేధింపులు, 5 హత్యలు జరిగాయి. 2013లో 52 కేసులు నమోదు కాగా, 16 కిడ్నాప్, 21 లైంగిక వేధింపులు, 2 హత్యలు జరిగాయి. 2014లో 367 కేసులు నమోదు కాగా, 259 వేధింపులు, 97 కిడ్నాప్‌లు, 9 హత్యలు జరిగాయి. 2015లో 438 కేసులు నమోదు కాగా, 293 లైంగిక వేధింపులు, 85 కిడ్నాప్, 11 హత్యలు జరిగాయి. అదేవిధంగా అదేవిధంగా మైనర్ బాలికలపై అత్యాచార చట్టం కింద 2014లో 97, 2015లో 85, 2016లో 119 కేసులు నమోదయ్యాయి.
బాలికలు, మహిళలను చైతన్య పరుస్తున్నాం:
మహిళలు, బాలికలపై దాడులను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, బాలికలు, మహిళలను చైతన్య పరుస్తున్నామని అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్) స్వాతిలక్రా తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవేర్‌నెస్ క్యాంపైన్ నడుస్తోందని, పలువురు ఫిర్యాదుదారులు కూడా పాఠశాలలు, కళాశాలల్లో ఎన్జీవోల సహకారంతో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసులు నగర శివారు ప్రాంతాలకు కూడా వెళ్లి మైనర్ల కుటుంబీకులు, బాధితులతో మాట్లాడి బాధిత లైంగిక దాడుల బాధితులచే ఫిర్యాదులు ఇప్పిస్తున్నారన్నారు. మహిళలు, బాలికలు బాధితులెవరైనా నేరుగా షీటీమ్స్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కఠిన శిక్షలతోనే లైంగిక దాడులు తగ్గుతాయి: బాలల హక్కుల సంఘం
మైనర్ బాలికలపై దాడుల నివారణకు నిందితులకు కఠిన శిక్ష విధిస్తేనే లైంగిక నేరాలు తగ్గుతాయని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు అచ్యుతరావు తెలిపారు. నేరాలపై అవగాహన, లైంగిక నేరాలపై విద్యార్థులు, పోలీసులు విషదీకరిస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తే లైంగిక నేరాలు తగ్గుతాయని వారు అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం, ప్రజలు కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.

విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర వహించారని ముఖ్యమంత్రి కెసిఆర్ పోరాటయోధులను మర్చిపోరని, విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో సంఘం నూతన డైరీని ఆయన ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల చిక్కుముడి విప్పుకుంటూ అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం తెలంగాణ ప్రజలకు వెలుగునిచ్చే విద్యుత్ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా వుంటుంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ఏమవుతుందో అని వ్యాఖ్యానించిన వారి నోర్లు మూయించే విధంగా నిరంతరం విద్యుత్‌ను ఇవ్వగల్గుతున్నాము ఈ పని గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో 5వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి వున్నదని ప్రస్తుతం పదివేల ఐదువందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. అనుకున్న ప్రకారం చెప్పిన ప్రకారం విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేస్తున్న విద్యుత్ కార్మికులందరిని సభాముఖంగా మంత్రి అభినందించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రైతులకు పదిహేనువందల మెగావాట్ల విద్యుత్ ఇస్తన్నామని, వచ్చే ఫిబ్రవరికి తొమ్మిదివేల ఐదువందల మెగావాట్ల డిమాండ్ ఉందని, ఇందుకు విద్యుత్ కార్మికులు కృషి చేయాలని అన్నారు. తాత్కాలిక ఉద్యోగస్తులందరిని రెగ్యులర్ చేస్తామని, వారం రోజులు సంఘం కార్యాలయాన్ని ప్రారంభించుకుందామని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. తొలుత తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు నిరంతర విద్యుత్ హామీతో తెలంగాణ సంపాదించుకున్నామని, ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లోనే ఈ ఘనత సాధించామని అన్నారు. జెన్‌కో విద్యుత్‌ను పుట్టిస్తే ట్రాన్‌స్కో ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తూ అందరికి వెలుగునిస్తోందని అన్నారు. విద్యుత్ కార్మికుల న్యాయమైన కోర్కలు తీర్చడమే కాకుండా తాత్కాలిక ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఎన్‌టిపిసి నుండి చతీస్‌గఢ్ నుండి విద్యుత్‌ను సరఫరా చేసుకోగలుగుతున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత సబ్‌స్టేషన్‌లను నిర్మించుకొని ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ వెలుగు నింపుకుంటున్నామని కవిత అన్నారు. తొలుత సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాష్, ఉపాధ్యక్షులు బి.మోహన్‌రెడ్డి, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని ప్రసంగించారు.