హైదరాబాద్

రిహార్సల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకింగ్‌ను సాధించేందుకు జిహెచ్‌ఎంసి విశ్వప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నెల 2 నుంచి మూడు రోజుల పాటు నగరంలో జరగనున్న ఈ సర్వేక్షణ్‌కు సిద్దమయ్యేందుకు బల్దియా సొంతగా రిహార్సల్స్ నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా స్వచ్ఛ కార్యక్రమాలకు సంబంధించి సర్కిళ్లలో పరిస్థితిని అంచనా వేసేందుకు జిహెచ్‌ఎంసి స్వీయ నిర్థారణకు సిద్దమైంది. నగరంలోని వివిధ సర్కిళ్లలో చేపడుతున్న పారిశుద్ద కార్యఅకమాలు, బహిరంగ మల,మూత్ర విసర్జన నిషేధం అమలు, చెత్త నుంచి తడి,పొడిని వేరు చేయటం, పెద్ద ఎత్తున చెత్త ఉత్పత్తి చేసే రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, మార్కెట్లలో సేంద్రీయ ఎరువుల తయారీ గుంతల ఏర్పాటు, వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై నగర వాసుల్లోనున్న అవగాహన కార్యక్రమాల నిర్వాహణ తదితర అంశాలపై ఒక రిహార్సల్ మాదిరిగా నిర్వహించారు. పారిశుద్ద్య పనుల నిర్వాహణ, స్వచ్ఛ కార్యక్రమాలపై అవగాహన, బహిరంగ మల,మూత్ర విసర్జన నివారించే అంశంపై వెనకబడ్డ సర్కిళ్లను గుర్తించి వచ్చే నెల స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రారంభమయ్యేలోపు పరిస్థితిని మెరుగుపర్చాలన్నది అధికారుల ఉద్దేశ్యం. అంతేగాక, పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వాహణకు సంబంధించి ఆరోగ్యకరమైన పోటీతత్వం ఏర్పడుతుందని కూడా భావిస్తున్నారు. కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వినూత్న విధానంలో మొత్తం అయిదు అంశాలకు వెయ్యి మార్కులు నిర్ణయించారు. ఒక్కో ప్రశ్నకు రెండు వందల మార్కుల చొప్పున ఉన్న ఈ ఐదు అంశాలను వివిధ సర్కిళ్లలో పకడ్బందీగా చేస్తున్న అమలుపై స్వయంగా మార్కులు నిర్ణయించి ప్రధాన కార్యాలయానికి పంపాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ నెల మొదటి వారంలో ఆయా ఐదు అంశాలకు సంబంధించి చేపట్టిన కార్యక్రమాలు, స్వచ్ఛ కార్యక్రమాలపై స్వయంగా సమీక్షించుకోవాలన్న ఆదేశం మేరకు డిప్యూటీ కమిషనర్లు ఇపుడు స్వయంగా మార్కులు వేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు వివిధ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు పంపిన మార్కుల ప్రకారం ఆయా సర్కిళ్లకు దక్కిన ర్యాంకుల వివరాలిలా ఉన్నాయి.
* సర్కిల్ 16 964 మార్కులతో ముందంజలో ఉంది.
* సర్కిల్ 12కు 952 మార్కులతో రెండో స్థానంలో ఉంది.
* సర్కిల్ 8కి 934 మార్కులతో మూడో స్థానంలో ఉంది.
వీటితో పాటు సర్కిల్ 13, 3బి, 3సి, 2, 7ఏ, 7బి, 5్భ, 5బి, సర్కిల్ 1 స్వల్ప మార్కుల తేడాతో తదుపరి స్థానాలను దక్కించుకున్నాయి.
జోన్ల వారీగా పరశీలిస్తే మొత్తం 4వేల మార్కులకు గాను 3583 మార్కులతో నార్త్‌జోన్ మొదటి స్థానంలో, అలాగే 5వేల మార్కులకు గాను 4381 మార్కులతో వెస్ట్‌జోన్ రెండో స్థానంలో, సౌత్ జోన్‌లో మొత్తం 4వేల మార్కులకు గాను 3473 మార్కులతో తృతీయ స్థానం, 7వేల మార్కులకు గాను 5981 మార్కులతో సెంట్రల్ జోన్ నాలుగో స్థానంలో, ఈస్ట్‌జోన్ 4వేల మార్కులకు గాను 2648 మార్కులతో ఈస్ట్‌జోన్ అయిదు స్థానాన్ని దక్కించుకుంది.