హైదరాబాద్

త్వరలోనే మెట్రో కూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: నిత్యం ట్రాఫిక్, రద్దీతో సతమతమయ్యే నగరవాసులు చిరకాల స్వప్నం మెట్రోరైలు ఈ ఏటే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మూడు కారిడార్లుగా కొనసాగుతున్న మెట్రోరైలు పనుల్లో భాగంగా నాగోల్ నుంచి బేగంపేట వరకు 16 కిలోమీటర్ల మార్గాన్ని చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ పరిశీలించారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్లకు సర్వీసు రోడ్లను, సమీపంలో ఉన్న కాలనీలు, ప్రభుత్వా కార్యాలయాల నుంచి ప్రయాణికులను తీసుకువచ్చేందుకు వీలుగా ఫీడర్ బస్సులు, విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. రెండు కారిడార్లలో తొలి దశగా అందుబాటులోకి రానున్న ఇరవై కిలోమీటర్ల మెట్రోరైలును అన్ని రకాల హంగులు, సౌకర్యాలతో అందుబాటులోకి తెచ్చే దిశగా సర్కారు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా సికిందరాబాద్ పరేడ్‌గ్రౌండ్స్ వద్ద ఫుట్‌పాత్‌ను మెరుగుపరిచి, పచ్చ్ధనాన్ని పెంపొందించినందుకు మెట్రోరైలు అధికారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ కారిడార్ 1లోని మియాపూర్ నుంచి సంజీవరెడ్డినగర్ వరకు, కారిడార్ 3లోని నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ఈ రెండు కారిడార్లలో పనులను వీలైనంత త్వరగా ముగించి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించటంతో క్షేత్ర స్థాయి అధికారుల పర్యటనలు ముమ్మరమయ్యాయి. ఈ కారిడార్లలో ఫీడర్ బస్సుల సేవలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిల్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందుకే పనులను ఎప్పటికపుడు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారులతో ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించారు. ముఖ్యంగా ఈ రెండు కారిడార్లలో మెట్రో రైలు పరుగులు పెట్టే నాటికి ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. మెట్రోరైలు అందుబాటులోకి వచ్చే ప్రాంతాల్లోని అన్ని స్టేషన్లలో కూడా సైకిళ్లు అందుబాటులో ఉంటే కొంత వరకు ట్రాఫిక్, కాలుష్యం సమస్య తగ్గుముఖం పట్టే అవకాశమున్నందున, ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అంతేగాక, మెట్రోస్టేషన్లు నిర్మించిన ప్రాంతాల్లో పాదచారుల కష్టాలను కూడా తగ్గించేందుకు అవసరమైన చోట స్కైవేలు నిర్మించాలని ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్‌లో ప్రభుత్వం నిర్మించనున్న ఆపరేషన్ కంట్రోల్ సెంటర్(వోసిసి)కు మెట్రో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ను అనుసంధానం చేసేందుకు వీలుగా నగర పోలీసు కమిషనర్ ఎల్ అండ్ టి ఇంజనీర్లు సలహాలు తీసుకోనున్నారు. ఎంతో ముందు చూపుతో నిర్మించిన మెట్రో స్టేషన్లలో యాణికులతో పాటు వయోవృద్దులకు, చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నారు. మెట్రోరైల్‌లో, స్టేషన్లలో కూడా ప్రయాణికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై మెట్రోరైలు, పోలీసు, ఎల్ అండ్ టి శాఖల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి.

రైలు టిక్కెట్
దొంగల గుట్టురట్టు
సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో
ముగ్గురి అరెస్టు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 16: సంక్రాంతిని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లిన జనం తిరుగు ప్రయాణమవుతోంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అదనపు రైళ్లు, ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నప్పటికీ హైదరాబాద్, సికిందరాబాద్ రేల్వే స్టేషన్లలో దళారుల దందా తగ్గట్లేదు. రైల్వే టిక్కెట్లు కన్‌ఫార్మ్ చేస్తామంటూ మోసాలకు పాల్పడుతోన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 8 వేలు నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ టిక్కెట్ల కన్‌ఫార్మ్ పేరుతో ప్రయాణికులను మోసం చేస్తున్నారు. ప్రయాణికులను మోసగిస్తున్న వ్యక్తులు రైల్వే టిటిసి అధికారులతో కుమ్మక్కై టికెట్లు కన్‌ఫార్మ్ చేస్తున్నారని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అదనపు చార్జీలు చెల్లించినా..తమకు రైళ్లలోకి వెళ్లే సరికి టికెట్ కన్‌ఫార్మ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చిందని పలువురు ప్రయాణీకులు వాపోయారు. రైల్వే స్టేషన్‌లలో టిక్కెట్ల కన్‌ఫార్మ్ మోసాన్ని అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.