హైదరాబాద్

తెలంగాణలో బిజెపిదే అధికారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: మున్ముందు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వీలుగా బిజెపిని బలోపేతం చేస్తామని, ఇందుకు ప్రతి కార్యకర్త కంకబద్దులు కావాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ బిజెపి అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యుడు ఎన్. రామచంద్రరావు సోమవారం ఆర్టీసి కళ్యాణమండపంలో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన దత్తాత్రేయ ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో రోజురోజుకి బిజెపి పార్టీ బలపడుతుందని, రామచంద్రరావు నేతృత్వంలో ఎదురులేని శక్తిగా ఎదుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ నాయకుడు మురళీధర్‌రావు మాట్లాడుతూ రామచంద్రరావు విద్యార్థి దశ నుంచే అనేక కార్యక్రమాలను ఎంతో పట్టుదలతో నిర్వహిస్తూ విజయవంతం చేశారని గుర్తుచేశారు. ఎన్నో ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశాలొచ్చినా, ఆయన బిజెపి పార్టీనే నమ్ముకుని, ఎంతో విశ్వాసంతో పార్టీ గురించి శ్రమించారని వ్యాఖ్యానించారు. ఏ కార్యక్రమం తీసుకున్నా, విజయవంతం చేసే శక్తి సామర్ద్యాలున్న రామచంద్రరావు గ్రేటర్ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించటం పార్టీకి మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ గత శాసన మండలి గ్రాడ్యుయేట్ స్థానం ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, రామచంద్రరావు విజయాన్ని అడ్డుకోలేకపోయిందన్నారు. అధికార పార్టీ ఎంతో సవాలుగా తీసుకున్న శాసన మండలి స్థానం ఎన్నికల్లో రామచంద్రరావు విజయం సాధించి తన సత్తాను చాటారన్నారు. అందుకే ఆయన్ను నగర అధ్యక్షుడిగా నియమించినట్లు వివరించారు. ఆయన హయంలో బిజెపి పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి శాసన సభ పక్ష నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, నగర మాజీ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు హజరయ్యారు.