హైదరాబాద్

జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. సిగ్మా ఆర్ట్ ఫొటోగ్రఫీ ఆధ్వర్యంలో శాప్ ఇంటర్నేషనల్ ఫొటో అవార్డు-2017ని మంగళవారం ఉదయం రవీంద్రభారతి సమావేశ మందిరంలో ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నివర్గాలకి న్యాయం చేస్తారని అన్నారు. ఫొటో చూడగానే ఇతివృత్తం అర్థమవుతుందని, వెయ్యి పదాలలో చెప్పాలనుకున్నది ఒక్క ఫొటో చెప్పగలుగుతుందని పేర్కొన్నారు. ఫొటోగ్రఫీ చాలా గొప్పదని, దాని శక్తి మీడియాలో ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే కొన్ని సన్నివేశాలను చమత్కరించారు. నాగభూషణం (సిరిసిల్ల) పేరుతో గ్రాండ్ అవార్డును ఫొటోగ్రాఫర్ రాజేష్‌రెడ్డికి ప్రదానం చేశారు. 2016 సంవత్సరానికి కె.ప్రభాకర్‌కు, 2017 సంవత్సరానికి ఎల్.విశ్వనాథ్‌కు శాప్ అవార్డులను మంత్రి కెటిఆర్ ప్రదానం చేశారు. కళాభవన్ ఆర్ట్ గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు మాట్లాడుతూ ఫొటోగ్రఫీ ప్రాముఖ్యతను తెలుపుతూ నాగభూషణం పేరుతో అవార్డు ఇస్తున్నందుకు అభినందించారు. కార్యక్రమంలో సాలర్‌జంగ్ మ్యూజియం జాయింట్ డైరెక్టర్ డా.ఎ.నాగేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రకృతిని కాపాడుకుంటూ మానవాళిని రక్షించుకుందాం
హైదరాబాద్, జనవరి 17: దేశ బడ్జెట్ ఇరవై లక్షల కోట్లు ఉండగా ఇందులో మూడవ వంతు ఏడులక్షల కోట్లకుపైగా ఇంధనం కోసం ఖర్చు చేస్తున్నామని, అనవసరంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలోని పెట్రోలియం కార్పొరేషన్ రీసెర్చ్ అసోసియేషన్, ఇంధన సంస్థల సౌజన్యంతో ‘సక్షమ్’ (సంరక్షన్ క్షమతా మహోత్సవ్) 2017 కార్యక్రమంలో భాగంగా బాలబాలికలకు ఇంధన పొదుపు అంశంపై చిత్రలేఖన పోటీ జరిగింది. పోటీలో గెలుపొందిన బాలలకు మంత్రి ఈటల రాజేందర్ బహుమతి ప్రదానం చేశారు. బహుమతి పొందిన చిత్రాలలో ఒక్కటి కూడా ఇంధన పొదుపు గురించి లేకపోవడం గమనార్హం అని ఈటల వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు సంవత్సరమంతా ఇంధన పొదుపు గురించి బాలబాలికలకు ఫొటీలు నిర్వహిస్తున్నారని అభినందించారు. పొల్యూషన్ లేకుండా మనిషి ఆరోగ్యకరంగా వుండాలని అందుకు ఇంధనాన్ని పొదుపుగా వాడాలని అన్నారు. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువై వాహనాలు బయటకు తియ్యడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. పొల్యూషన్‌లోని కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించడానికే హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నామని చెప్పారు. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్‌ను ఇస్తున్నాయని, వాహనాలు వాడకం తగ్గించి నడక, సైకిల్ ద్వారా ప్రయాణం ఆరోగ్యకరమని అన్నారు. రానున్న కాలంలో ప్రభుత్వం వాహనాల వాడుకను నియంత్రించకపోతే కాలుష్యం పెరిగిపోతుందని ఈటల హెచ్చరించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రక్తాన్ని కాపాడుకున్నట్లే ఇంధనాన్ని కాపిడుకోవాలని అన్నారు. మనిషి క్రూర మృగంగా మారి చెట్లను నరికేస్తున్నాడని, ఆ చర్యలను మాన్పించి చెట్లను నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం పేరుతో ప్రారంభించారని అన్నారు. తొలుత హెచ్‌పిసిఎల్ చీఫ్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ స్వాగతం పలుకగా డిజిఎం నరసింహ కార్యక్రమాన్ని వివరించారు. బి.చంద్రప్రకాష్, రాజేష్ నాయక్, ప్రభురాయ్ పాల్గొన్నారు.