హైదరాబాద్

రోహిత్ చట్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జనవరి 17: రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావల్సిన అవసరం ఎంతైన ఉందని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశారు. రోహిత్ వేముల ప్రథమ వర్థంతి సందర్భంగా సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సభకు సిపిఐ(యం)లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. రాములు రోహిత్‌కు నివాళులు అర్పించి సభకు అధ్యక్షత వహించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు, విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌ను కఠినంగా శిక్షించాలని, రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. అంతేగాక, రోహిత్ చట్టం వెంటనే చేయాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు సిహెచ్ సీతారాములు, జి. నాగయ్య, టి. జ్యోతి, డిజి. నర్సింగ్‌రావు, నంద్యాల నర్సింహారెడ్డి, సిపిఐ నుంచి కార్యదర్శివర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు, సుధాకర్‌రెడ్డి, ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు భూతం వీరన్న, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకులు సిహెచ్. మురహరి, సిపిఐఎంఎల్( న్యూ డెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావులు మాట్లాడుతూ హెచ్‌సియులో పిహెచ్‌డి చేస్తున్న దళిత విద్యార్థి, మేధావి రోహిత్ వేముల కేంద్ర మంత్రుల మొరటు ప్రవర్తన, కుల వివక్ష కారణంగానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లోకి నెట్టబడినట్లు వెల్లడించారు. వెంటనే విద్యా సంస్థల్లో కుల వివక్ష, అణిచివేత నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై విద్యార్థి, దళిత, మహిళ, ప్రజాస్వామిక శ్రేణులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

హుక్కా సెంటర్ల కూల్చివేత
అక్రమ నిర్మాణాలపై కన్ను

హైదరాబాద్, జనవరి 17: నగరంలో నిబంధనలకు విరుద్దంగా, ఇష్టారాజ్యంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జిహెచ్‌ఎంసి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కొనసాగుతున్న 12 హుక్కా కేంద్రాలు అక్రమంగా నిర్మించిన భవనాల్లో నెలకొల్పినట్లు అధికారులు గుర్తించారు. జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్, పోలీసు, టాస్క్ఫోర్సు, ట్రాఫిక్ పోలీసుల సహాయంతో మంగళవారం ఉదయం నుంచి హుక్కా సెంటర్లు కొనసాగుతున్న ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ఓసిడి హుక్కా సెంటర్, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లో ఉన్న మోక్ష హుక్కా సెంటర్, బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని మాన్సింగ్ స్క్వాయర్ భవనం టెర్రస్‌పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను, అలాగే జూబ్లీహిల్‌స రోడ్ నెం. 36లోని ది ఎర్త్ హుక్కా సెంటర్, బంజారాహిల్స్ రోడ్ నెం. 9లోని వాటర్ హుక్కా సెంటర్‌లున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. మరికొన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.