హైదరాబాద్

పిఎం కృషి సింఛాయి యోజనను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతి పంట చేనుకు నీటి సౌకర్యం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన (పిఎంకెఎస్‌వై)ను ప్రతి జిల్లా సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. బుధవారం సచివాలయం నుండి పిఎంకెఎస్‌వైపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లా సమగ్రమైన సాగునీటి ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. ముసాయిదా ప్రణాళిక తయారుచేసిన తరువాత ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. పిఎంకెఎస్‌వైలో చిన్ననీటి వనరుల అభివృద్ధి, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులు, డ్వామా, వ్యవసాయ, జిల్లా పరిషత్ సిఇఓ, భూగర్భ జలశాఖ తదితర శాఖలు సమన్వయంతో సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ జిల్లా ముసాయిదా ప్రణాళిక ఇంతవరకు పూర్తికాలేదని, ఈ నెల 11వరకు సంబంధిత ఏజెన్సీ ప్రణాళికను అందజేయాలని నిర్ధేశించామని, ఈ నెల 13న జిల్లా స్థాయి సాగునీటి కమిటీలో ముసాయిదా ప్రణాళికపై చర్చించిన అనంతరం ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. జలగ్రామం పథకం కింద కేంద్ర జలసంఘంతో చర్చించి భూగర్భ జలాలు ఇంకిపోయిన రెండు గ్రామాలను ఎంపిక చేశామని, అవి మహేశ్వరం మండలం మాసాన్‌పల్లి, మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామాలని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటేశ్వర్లు, డ్వామా, డిఆర్‌డిఎ పిడిలు హరిత, సర్వేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి జగదీష్, పంచాయతీ రాజ్ ఎస్‌ఇ మిల్టన్ పాల్గొన్నారు.