హైదరాబాద్

అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: వివిధ శాఖల అధికారులంతా ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంచుకుని ప్రణాళికబద్దంగా పని చేసి, నిజమైన లబ్దిదారులకు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా హితవు పలికారు. తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సరానికి రూపొందించిన డైరీ, క్యాలెండర్లను కలెక్టర్, సంఘణ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్,టిజిఓఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు మమతతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అంకితభావంతో పనిచేసినపుడే పరిపాలన చక్కగా సాగి, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతాయన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పొరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అధికారులు, ఉద్యోగులు కష్టపని పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రవేశపెట్టిన హెల్త్‌కార్డుల పథకాన్ని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు పొందేందుకు అమలు చేస్తుందన్నారు. అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో ప నిచేసే ప్రభుత్వానికి సహకరించాలని ఆయన సూచించారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణయాదవ్ మాట్లాడుతూ జిల్లాలోని అధికారులందరూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు నిరంతరంగా కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, టిఎస్ ఐపాస్, టి హబ్ కార్యప్రజలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం నాయకులు, గజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, సంఘం నేతలు పురుషోత్తమ్‌రెడ్డి, విష్ణువర్దన్‌రావు, సహదేవ్, మదుసూధన్, అరుణ్‌కుమార్, బేగ్, వెంకటయ్య, నర్సింహులు, మోహన్‌నారాయణ. ఓం ప్రకాశ్, జూపల్లి రాజేందర్, శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నిల్ విక్టర్, ఎం.సుజాత, ఎస్‌పిఆర్ మల్లేశ్, ఖాధర్, సునీత, జోషీ, సత్యబాబు, సురభి వెంకటేశ్వర్లు, స్వరూపరాణి, బండి రమేష్, వై. నాగేందర్, విష్ణుసాగర్, షేక్ అబ్దుల్ లతీఫ్, స్వాతిగౌడ్, చందర్‌కుమార్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

సినీ వినీలాకాశంలో ధృవతార ఎన్టీఆర్

హైదరాబాద్, జనవరి 18: మహానటుడు, రాజకీయ దురంధరుడు ఎన్.టి.రామారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో చిరంజీవిగా వున్నారని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఎన్‌టిఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువకళావాహిని నిర్వహణలో బుధవారం రవీంద్రభారతిలో ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఎన్టీఆర్ లలితకళా పురస్కార ప్రదానోత్సవానికి రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్‌టిఆర్ ఇంకా మన ముందు వున్నట్లుగా వుంది. ఆయన ఏ పాత్ర ధరించినా ఆ పాత్రకు జీవం పోసేవారు. కృష్ణుడు, రాముడు ఎలా వుంటారో తెలియదు కానీ ఆ పాత్రలలో ఎన్‌టిఆర్‌ని చూసాక అలాగే వుంటారను