హైదరాబాద్

నిబంధనలకు నీళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్, రద్ధీకి అనుకూలంగా నిర్మించే రోడ్ల నిర్మాణంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో గతంలో కురిసిన అతి భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు నేటికీ పూర్తి స్థాయిలో బాగుపడలేదు. అప్పటి నుంచి రోడ్ల మరమ్మతులకు, రీ కార్పెటింగ్‌కు కోట్లాది రూపాయలను వెచ్చించామని చెప్పుకునే అధికారులు వారు చేపట్టిన పనులు ఎంత వరకు శాస్ర్తియమైనవి, అందులో నాణ్యత, ఐఆర్‌ఎస్ ప్రమాణాలెంత వరకు పాటించారన్న విషయంపై సమాధానం చెప్పలేకపోతున్నారు. పాలకుల్లోనూ జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ వ్యవస్థపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి బిటి, సిసి రోడ్లను నిర్మిస్తున్నా, ఎక్కడ కూడా మెరుగైన నాణ్యత ప్రమాణాలతో, ఐఆర్‌ఎస్ గైడ్‌లైన్స్‌తో పనులు జరగకపోవటం వల్లే నేడు రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని వాహనదారులు మండిపడుతున్నారు. నగరంలోని విఐపి జోన్‌లోని పలు ప్రధాన రహదార్లను గమనిస్తే బిటిపై సిసి, సిసిపై బిటి రోడ్లు దర్శమిస్తాయి. కొత్త రోడ్డు వేసేటపుడు కనీసం పాతరోడ్డును తొలగించాలన్న చేయాలన్న కనీస ఆలోచన రాకపోవటం మన ఇంజనీర్ల పనితీరుకు నిదర్శనం. కొత్తగా వేసిన రోడ్లు కనీసం వేసిన తర్వాత కొద్ది నెలలైనా వాహనదారులకు అనుకూలంగా ఉండేలా నిర్మించలేకపోవటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సిసి, బిటి రోడ్ల నిర్మాణంలో అధికారులు పాటించాల్సిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారన్న విమర్శ ఉంది. అరకొర నైపుణ్యం కల్గిన ఇంజనీర్లు, సిబ్బందికి కనీసం టెండర్ల ప్రక్రియపై అవగాహన లేనికపోవటమే ఇందుకు కారణం. నగరంలో నిత్యం రద్ధీగా ఉండే లక్డీకాపూల్, బషీర్‌బాగ్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లోని బిటి రోడ్లను గమనిస్తే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు కూడా మునిగిపోయేలా రోడ్లు వేయటం ఇంజనీర్ల పనితీరుకు నిదర్శనం. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేసిన రోడ్లనే రీ కార్పెటింగ్ పేరిట మళ్లీ వేయటం వల్లే వేసిన కొద్దిరోజులకే రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఫలితంగా ప్రజాధనం వృథా కావటంతో పాటు ప్రజలకు కష్టాలు తప్పట్లేదు.
చురకలు పెట్టినా..మారని తీరు
ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక మెట్రోపాలిటన్ సిటీ వేదికగా ప్రతి వంద ఏళ్లకు ఓ సారి జరిగే జీవవైవిధ్య సదస్సు నగరంలో 2012లో జరిగింది. ఈ సదస్సు ఏర్పాట్లలో భాగంగా అప్పటి కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు పాతబస్తీలోని సిటీకాలేజీ వద్ధ రోడ్డు నిర్మాణం తీరును పరిశీలించి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చిన కమిషనర్లు సైతం ఇంజనీరింగ్ విభాగం పనితీరును మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇంజనీర్లు కనీసం మేస్ర్తిలుగా కూడా పనిచేయటం లేదు. కనీసం మేస్ర్తిలైనా బాగా పనిచేస్తారంటూ మండిపడ్డా, నేటికి గ్రేటర్ ఇంజనీర్ల పనిలో మార్పు రాకపోవటం గమనార్హం. రోడ్ల నిర్మాణం, రీ కార్పెటింగ్‌కు సంబంధించి అమలు చేయాల్సిన ఇండియన్ రోడ్డు కాంగ్రెస్(ఐఆర్‌ఎస్) నిబంధనల ప్రకారం రోడ్డు నిర్మించే ముందు వరద నీటి కాలువలను ఇరువైపులా తప్పకుండా ఏర్పాటు చేసి, ఎంత వర్షం కురిసినా, రోడ్డుపై నీరు ఆగకుండా నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఎప్పటికపుడు చేపడుతున్న రోడ్డు విస్తరణ కారణంగా ప్రస్తుతం వెడల్పు పెరిగి, ఆ వరద నీటి కాలువలు రోడ్డు మధ్యలోకి వచ్చాయి. అంతేగాక, వరద నీటి కాలువలు కనుమరుగైపోవటంతో చిన్నపాటి వర్షానికే రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వర్షం నీరు నిలుస్తుంది.

చెల్లప్ప కమిషన్ సిఫార్సులను
బహిర్గతం చేయాలి
ముషీరాబాద్, జనవరి 18: చెల్లప్ప కమిషన్ సిఫార్సులను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్, పార్టీ నేతలు షేక్‌బాష, వి.రాములు డిమాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఆదివాసి, గిరిజన సామాజిక వర్గాల అభివృద్ధిని నిరోదించటానికి చెల్లప్ప కమిషన్ పేరుతో సిఎం కెసిఆర్ రాజకీయ లబ్ధికి పూనుకున్నారని ఆరోపించారు. గిరిజనేతర కులాలను ఎస్టీలుగా గుర్తించి ఆదివాసీలకు తీవ్రద్రోహం చేశారని విమర్శించారు. చెల్లప్ప కమిషన్ ముసుగులో కొన్ని బిసి కులాలను సైతం ఎస్టీ జాబితాలో చేర్చటానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. చెల్లప్ప కమిషన్ నివేదిక బహిర్గతం చేయకపోవటానికి కారణం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర పరిధిలో లేని ఎస్టీ రిజర్వేషన్ల అంశం పట్ల తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్ల జాబితాలో ఏ తెగనైనా చేర్చాలన్నా, తీసేయాలన్నా భారత పార్లమెంటు పరిధిలో ఉంటుందని గుర్తు చేశారు. జాతయ ఎస్టీ కమిషన్ సిఫార్సులు, ఎస్టీ పార్లమెంటరీ ఫోరం, భారత రాష్టప్రతి ఆదేశాలతోనే ఎస్టీ రిజర్వేషన్ల పెంపు జరుగుతుందని వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340, 342 నిభందనలకు వ్యతిరేకంగా సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్లను అనర్హులకు కట్టబెట్టే ప్రయత్నాలను ఆదివాసి ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.