హైదరాబాద్

ముగిసిన ‘స్థారుూ’ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: జంటనగరవాసులకు అవసరమైన, అత్యవసరమైన పౌరసేవలందించే జిహెచ్‌ఎంసి విధి విధానాల్లో, అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించే స్థారుూ సంఘం సమావేశం గురువారం జరిగింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అయిదు అంశాలతో కూడిన అజెండాపై సుదర్ఘీ చర్చ జరిగింది. ఇందులో ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉంటూ తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న మెహిదీపట్నం మెయిన్‌రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ స్థారుూ సంఘం అక్కడ సబ్‌వేను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఇప్పటికే అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు స్థారుూ సంఘం ఆమోద ముద్ర వేసింది. అజెండాలో రెండో అంశంగా పేర్కొన్న స్పోర్ట్స్ సెక్షన్‌లోని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ గేమ్స్ బి. రాజేంద్రప్రసాద్‌కు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ గేమ్స్, స్పోర్ట్స్‌గా పదోన్నతి కల్పించాలన్న ప్రతిపాదనను మజ్లిస్ పార్టీ సభ్యులు తిరస్కరించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి వచ్చే వారం నిర్ణయం తీసుకోవచ్చునని సభ్యులు సూచించారు.
ఆమోదించిన అంశాలు
* మెహిదీపట్నం పివిఎన్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం. 13 వద్ధ రైతుబజార్ చౌరస్తాలో పాదచారులు సౌకర్యార్థం సబ్ వేను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించింది.
* పాతబస్తీలో ప్రస్తుతం 40 అడుగుల విస్తీర్ణంతో ఉన్న బడాబజార్ జంక్షన్ నుంచి భవానీనగర్ మెయిన్ రోడ్డును 60 అడుగుల మేరకు విస్తరించాలని ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు సంఘం అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అంతేగాక, స్థల సేకరణ అవకాశాలను పరిశీలించాలని కూడా సూచించింది.
* నగరంలోని తిరుమల స్కూల్ నుంచి వివేకానందనగర్ మీదుగా ఎస్‌బిఐ కాలనీ వరకు ప్రస్తుతం 60 అడుగుల వెడల్పుతో ఉన్న రోడ్డును వంద అడుగులకు విస్తరించాలన్న ప్రతిపాదనకు కూడా స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. స్థల సేకరణ విషయాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది.
* వెస్ట్‌జోన్‌లో హాఫీజ్‌పేట నంచి ఇందూ ప్రాజెక్టు(మంజీరారోడ్డు), అలాగే తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారి నుంచి శాంతినగర్ వరకు, పిజెఆర్ ఎంక్లేవ్, హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్ నుంచి ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గార్డెన్స్, అల్లాపూర్ జెకె పాయింట్ హోటల్ నుంచి వివినగర్ క్రాస్‌రోడ్డు వరకు, విజయలక్ష్మీ టవర్‌నుంచి మజీద్ రోడ్డు నాలుగో ఫేజ్ వరకు, రాజీవ్‌గాంధీ సర్కిల్ నుంచి లోధ్ అపార్ట్‌మెంట్ నాలుగో ఫేజ్ డబుల్ రోడ్డు వరకు, కల్యాణ్ ధియేటర్, ఎంఎంఆర్ గార్డెన్ నుంచి హెచ్‌ఏఎల్ పార్కు వరుకు, పిజెఆర్ నగర్ బస్టాపు వరకు, జెఎన్‌టియు జాతీయ రహదారి 65 నుంచి ప్రగతినగర్ వైపు వెళ్లే రోడ్డును మరింత విస్తరించి, వైట్‌టాపింగ్ రోడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనను స్థారుూ సంఘం ఆమోదించింది.

ఇంటి తాళాలు పగులగొట్టి
చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

హైదరాబాద్, జనవరి 19: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతోన్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 52తులాల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కరుడుగట్టిన ఇద్దరు నేరగాళ్లతో సహ ఐదుగురు దొంగలను గురువారం నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ డిసిపి లింబారెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మహరాష్టక్రు చెందిన మహమ్మద్ ఖలీల్ అలియాస్ షరీఫ్ ఆటో నడుపుతూ సరూర్‌నగర్‌లో ఉంటున్నాడు. అంబర్‌పేటకు చెందిన సర్వర్, ఎన్ శివతో పరిచయమై ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పహడీషరీఫ్‌కు చెందిన సయ్యద్ మజీద్ అలియాస్ జహాంగీర్, మహమ్మద్ మహబూబ్ అలీతో కలసి తాళాలు వేసివున్న ఇళ్లన టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. 11 చోరీలకు పాల్పడినట్టు వీరిపై కేసులు నమోదయ్యాయి.
నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరు చోరీలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులతో టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా వేసి వీరిని పట్టుకొని విచారించగా చేసిన నేరాలను అంగీకరించారు. ఐదుగురు ఇళ్ల చోరులను పట్టుకున్న ఇనె్స్పక్టర్ బల్వంతయ్య, సిబ్బంది రవి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌లను డిసిపి లింబారెడ్డి అభినందించారు.