హైదరాబాద్

‘స్వచ్ఛ’ పాదయాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: దేశంలోని 500 పై చిలుకు నగరాల్లో కొనసాగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నగరంలో చేపట్టేందుకు సమయం దగ్గరపడుతోంది. గత సంవత్సరం నిర్వహించిన ఈ సర్వేలో నగరానికి 19వ స్థానం దక్కటంతో ఈ సారైనా మెరుగైన ర్యాంకును దక్కించుకునేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు పలు కార్యక్రమాలను చేపట్టగా, ఇపుడు పాలకులు స్వచ్ఛపాదయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గురువారం జరిగిన స్థారుూ సంఘం కూడా అనుకూలంగా తీర్మానం చేసినట్లు తెలిసింది. అయితే నగరంలోని మొత్తం 150 డివిజన్లలో టిఆర్‌ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న 99 డివిజన్లలో ఎపుడెపుడు ఎక్కడెక్కడ ఈ స్వచ్ఛ పాదయాత్రలు చేపట్టలన్న అంశంపై నేడో,రేపో షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసేందుకు మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో కసరత్తు కొనసాగుతోంది. అయితే పాదయాత్రలు చేస్తూ ప్రజల మధ్యకు వెళ్లే ముందు తొలుత కార్పొరేటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత వచ్చే 23వ తేదీ నుంచి డివిజన్ల వారీగా ఈ పాదయాత్రలు నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది. డివిజన్లలో కార్పొరేటర్లు పాదయాత్ర నిర్వహించేటపుడు సర్కిల్ స్థాయిలో పారిశుద్ద్య విభాగానికి చెందిన అధికారులంతా ఉండేలా చూడాలని కార్పొరేటర్లు మేయర్‌ను కోరారు. స్వచ్ఛ్భారత్ మిషన్ చేపడుతున్న కార్యక్రమంపై, అలాగే వచ్చే నెల 2 నుంచి మూడు రోజుల పాటు నగరంలో నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి మెరుగైన ర్యాంకు దక్కాలంటే నగర పౌరులుగా మన బాధ్యత ఏమిటీ? అన్న అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని యోస్తున్నారు. అంతేగాక, ఇంట్లో పోగయ్యే చెత్తను తడి,పొడిగా వేరు చేయటం, బహిరంగ మల, మూత్ర విసర్జన నివారణకు పౌరుల బాధ్యతను గుర్తుచేసేలా, వారిని చైతన్యవంతులను చేసేలా ఈ పాదయాత్రలు నిర్వహించాలని భావిస్తున్నారు.