హైదరాబాద్

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: నగరంలో నిబంధనలకు విరుద్దంగా, ఇష్టారాజ్యంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జిహెచ్‌ఎంసి ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల్లో కొనసాగుతున్న 12 హుక్కా కేంద్రాలు గుర్తించి నేలమట్టం చేసిన అధికారులు ఇపుడు బేగంపేట, మాతాజీనగర్, సికిందరాబాద్ ప్రాంతాల్లో ప్రైడ్ ఇండియా అనే సంస్థ అక్రమ లే అవుట్లను చేసి, అందులో ఏర్పాటు చేసిన రోడ్డు వంటివి తొలగించారు. అంతేగాక, సదరు సంస్థ అక్రమంగా లే అవుట్లు చేసినట్లు గుర్తించిన అధికారులు ఆ సంస్థ కార్యాలయాన్ని కూడా మూసివేశారు. జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్, పోలీసు, టాస్క్ఫోర్సు, ట్రాఫిక్ పోలీసుల సహాయంతో ఈ చర్యలు చేపట్టారు. ఇదివరకు బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ఓసిడి హుక్కా సెంటర్, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లో ఉన్న మోక్ష హుక్కా సెంటర్, బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని మాన్సింగ్ స్క్వాయర్ భవనం టెర్రస్‌పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను, అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని ది ఎర్త్ హుక్కా సెంటర్, బంజారాహిల్స్ రోడ్ నెం. 9లోని వాటర్ హుక్కా సెంటర్‌లున్న అక్రమ నిర్మాణాలను జిహెచ్‌ఎంసి అధికారులు కూల్చివేశారు. ఇపుడు తాజాగా హుస్సేన్‌సాగర్ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి ప్రైడ్ ఇండియా చేసిన లే అవుట్లలోని రోడ్లను జిహెచ్‌ఎంసి అధికారులు తొలగించి, ఆ సంస్థ కార్యాలయాన్ని సీజ్ కూడా చేశారు. మున్ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను మరింత ముమ్మరం చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
పాతబస్తీలో అక్రమ నిర్మాణాలు లేవా?
అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు జిహెచ్‌ఎంసి ఏ చర్యలు చేపట్టినా పాతబస్తీకి మినహాయింపునిస్తుందన్న చర్చ జరుగుతోంది. ఎప్పటికపుడు న్యూ సిటీలో చిన్న చిన్న అక్రమ నిర్మాణాలను తొలగించే అధికారులు ఇపుడు ప్రైడ్ ఇండియా చేసిన లే అవుట్లలోని రోడ్లు వంటివి తొలగించినా, పాతబస్తీపై ఎందుకు దృష్టి సారించటం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. పాతబస్తీలో రాజకీయ నాయకులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి శాశ్వత ప్రాతిపదికన నేటికీ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై జిహెచ్‌ఎంసి అధికారులు ఎందుకు వౌనం వహిస్తున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

రోడ్లు పునరుద్ధరించకుంటే
క్రిమినల్ చర్యలు
ఇంజనీర్లకు కమిషనర్ అల్టిమేటం

హైదరాబాద్, జనవరి 19: నగరంలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర శాఖలు ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వేస్తున్నాయి..ఎప్పటికపుడు పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవటంతో జనం ప్రాణాలు పోతున్నా యి..ఇదేం ఇషామాషీగా ఉందా? అంటూ జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి ఇంజనీర్లపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేగాక, రోడ్లు తవ్విన వెంటనే ట్రాఫిక్‌కు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే పునరుద్దరించాలని లేని పక్షంలో క్రిమినల్ చర్యలు తప్పవని కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు.
ఇదే అంశంపై ఎప్పటికపుడు రోడ్లను పునరుద్దరించాలని మంత్రి కె. తారకరామారావు ఆదేశించినా, ఇంజనీర్లలో కదలికరాకపోవటం గమనార్హం. ఈ రకంగా ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేసిన ఇంజనీర్లను సస్పెండ్ చేయటంతో పాటు వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా బల్కంపేట సబ్ స్టేషన్ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు వరకు నాలుగున్నర కిలోమీటర్ల పొడువున 33కెవి అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మా ణం కోసం నవంబర్ 23వ తేదీ నుంచి రోడ్ల తవ్వకాలను ప్రారంభించారు. ఈ రోడ్డును ఎప్పటికపుడు పునరుద్ధరించేందుకుచర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినా, ఇంజనీర్లు నేటికీ కనీసం టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టకపోవటం, నత్తనడకన పునరుద్దరణ పనులు జరగటం పట్ల కమిషనర్ సర్కిల్ 10ఏ ఇంజనీర్లపై మండిపడ్డారు. రోడ్లు తవ్వటానికి ముందుగానే రోడ్డు పునరుద్దరణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలంటూ మంత్రి కెటిఆర్ ప్రకటించినా, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించటం పట్ల సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు తవ్వకాల పని ప్రారంభమై సుమారు 45రోజులు గడుస్తున్నా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. రోడ్ల తవ్వకాల సందర్భంగా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు క్షేత్ర స్థాయి విధులకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇతర శాఖల అధికారులతో కలిసి పనుల పురోగతిపై అంతర్గత వాట్సప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించినప్పటికీ, పట్టించుకుని ఇంజనీర్లపై మండిపడ్డారు.