హైదరాబాద్

ఒకరికి గణపాఠం.. మరొకరికి కనువిప్పా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులూ ఉండరన్న నానుడి మజ్లిస్, కాంగ్రెస్ పార్టీ విషయంలో నిజమైంది. 2004 నుంచి కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని నగరంలోనే ఎదురులేని పార్టీగా ఎదిగిన మజ్లిస్ పార్టీ ఇపుడు కాంగ్రెస్‌పై దాడులకు దిగటంతో మిత్రులుగా కొనసాగిన ఆ రెండు పార్టీలు రాజకీయ విరోధులుగా మారాయి. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు గత సార్వత్రిక ఎన్నికల వరకు కూడా మంచి రాజకీయ మిత్రులే. కానీ స్వరాష్ట్రంలో అనూహ్యంగా చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితులు వీరిని ఇపుడు బద్ద శత్రువులను చేశాయి. మూడు దశాబ్దాల క్రితం ఒకే ఒక కార్పొరేటర్ సీటుకు పరిమితమైన మజ్లిస్ పార్టీ నేడు ఎంపి, ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో, శాసనసభలో అడుగు పెట్టిన స్థాయికి ఎదిగింది. ఇందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే కాంగ్రెసే కారణమన్నది బహిరంగ రహస్యం. కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఫ్రెండ్లీ పార్టీగా కొనసాగే మజ్లిస్ ఎంత వేగంగా బలపడిందో, అంతే వేగంగా వ్యతిరేకతను కూడా పెంచుకుంటోంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మంగళవారం పోలింగ్ రోజు తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలి పక్ష నేత షబ్బీర్ అలీలపై పాతబస్తీలో జరిగిన దాడితో ఈ రెండు పార్టీలు బద్ద శత్రువులుగా మారిపోయాయి. ఈ ఘటన కాంగ్రెస్‌కు గుణపాఠంగాను, నేటికీ మజ్లిస్ తమకు ఫ్రెండ్లీ పార్టేనని చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్‌కు కనువిప్పు కావాలన్న విషయంపై నగరంలోని రాజకీయవర్గాల్లో వాడీవేడి చర్చ జరుగుతోంది.
2004 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్‌కు అనధికార మిత్రపక్షంగా కొనసాగుతూ మజ్లిస్ రెండు నుంచి ఏడు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నగర నాయకుల్లో ఆ పార్టీ టికెట్ ఎవరికి కేటాయించాలన్న విషయంపై తుది నిర్ణయమూ మజ్లిస్ నేతలే చేసేవారంటే ఆ పార్టీకి కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యతమిచ్చిందో అంచనా వేసుకోవచ్చు. అంతకు ముందు టిడిపితో కూడా ఫ్రెండ్లీ పార్టీగా వ్యవహారించేందుకు మజ్లిస్ ప్రయత్నాలు చేసినా, అప్పట్లో మల్లేపల్లిలో మజ్లిస్ నేత హత్యతో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మజ్లిస్ పార్టీని కాస్త దూరంగానే పెట్టారు. ఆ తర్వాత వైఎస్ సిఎం అయిన తర్వాత కాంగ్రెస్ మద్దతుతో మజ్లిస్ నగరంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. రాష్ట్ర విభజన, రాజకీయాల్లో మార్పుల నేపథ్యంలో ఇపుడు అధికార టిఆర్‌ఎస్ పార్టీకి ఫ్రెండ్లీ పార్టీగా మజ్లిస్ కొనసాగుతోంది.
ఉనికి కోసమే ఆరాటమా?
పాతబస్తీని కంచుకోటగా మార్చుకున్న మజ్లిస్ ఆ పార్టీలో చాలా కాలంగా కొనసాగి ఇతర పార్టీల్లో చేరి బలమైన నేతలుగా ఎదిగే వారిని టార్గెట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇందుకు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ గౌస్ కాంగ్రెస్ చేరి పురానాపూల్ నుంచి ఆయన, ఘాన్సీబజార్ నుంచి ఆయన సతీమణి, శాలిబండ నుంచి ఆయన కొడుకు పోటీ చేయటాన్ని సహించలేకపోయింది. పైగా ఈ మూడు డివిజన్లలోనూ గౌస్ మజ్లిస్‌కు వ్యతిరేకంగా విస్త్రృతంగా ప్రచారం చేపట్టారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ సైతం ఈ డివిజన్లలో రోడ్ షో నిర్వహించి, గౌస్ నాయకత్వాన్ని ఎంతో పొగిడారు. పైగా గౌస్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురానాపూల్ డివిజన్ మజ్లిస్ కంచుకోట, ఇప్పటి వరకు రెండుసార్లు గెలిచి, ఇపుడు హ్యాటిక్ కోసం అక్కడి అభ్యర్థి సున్నం రాజ్‌మోహన్ పోటీలో ఉన్నారు.
దశాబ్దాలుగా మజ్లిస్‌తో నేతగా వ్యవహారించిన గౌస్‌కు మజ్లిస్ ఎన్నికల వ్యూహంపై మంచి అవగాహన, అనుభవం ఉంది. దాంతో ఆయన పురానాపూల్‌లో పావులు కదిపే సరికి ఓటమి భయంతో మజ్లిస్ కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడిందనేది విపక్షాల వాదన. ఈ రకంగా మజ్లిస్‌పై ఆ పార్టీ నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేసినపుడు, పట్టు సడలుతున్న సమయంలో ఉనికిని చాటుకునేందుకు భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఉన్నత పదవుల్లో ఉన్న మజ్లిస్ నేతలు సైతం దాడులు చేసిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.
పోలింగ్ శాతం తగ్గటంతో అభ్యర్థుల్లో ఆందోళన
అల్వాల్, ఫిబ్రవరి 3: గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గటంతో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అందోళన పడుతున్నారు. మంగళవారం జరిగిన ఎన్నిల్లో కాలనీవాసులు ఓట్లు వేయడానికి అనాసక్తి చూపారు. కార్పొరెటర్‌ల వద్ద అభివృద్ధి పనులు చేయించుకున్న కాలనీవాసులు మొహం చాటేశారు. ఎప్పటిలాగే నాయకులు అభ్యర్థులు అందరు మురికివాడలు, బస్తీల చుట్టు ఓట్ల కోసం పాట్లు పడ్డారు. గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగితే కాలనీవాసులు వేశారని అనుకునే వారు కానీ అలా జరగక పోవటంతో లెక్క తప్పి నాయకులు ఆందోళన చెందుతున్నారు. పోటీ ఉన్న అభ్యర్థులు.. కాలనీ సంక్షేమ సంఘాల నాయకులకు ఫోన్ చేస్తే చాల మంది సెల్‌ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారని తెలుస్తుంది. అల్వాల్ సర్కిల్‌లో మాజీ కార్పొరేటర్‌లు ఇద్దరు ఉన్నారు. 135 నుండి పోటీ చేసిన మాజీ కార్పొరేటర్ గీతారాణి భర్త టి.మోహన్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు, ఆయన గతంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో ఇందిరానగర్, రాజీవ్ వీకర్ సెక్షన్, సత్యసాయి కాలనీ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయన సతీమణి గీతారాణి తాజా మాజీ కార్పొరేటర్. ఆమె హయాంలో కార్పొరేటర్ నిధులతోపాటు, కోఆప్షన్ సభ్యుడైన నందికంటి శ్రీ్ధర్ నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశారు. కానీ, వాటిని ఎవ్వరు పట్టించుకోలేదు. అదే వార్డు నుండి అల్వాల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంసి జగదీష్.. బిజెపి తరపున పోటీ చేశారు. వైస్ చైర్మన్‌గా ఉన్న సమయంలోని శివానగర్, టెలికాంకాలనీ, కానాజిగుడా, సుభాష్‌నగర్ ప్రాంతంలో ఆయన నిధులతోపాటు, ఎన్‌డిఎ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ నిధులు తీసుకవచ్చి అభివృద్ధికి కృషి చేశారు. అధికారంలో ఉన్న సమయంలో కాలనీ వాసులు వారి చుట్టు ఉన్నారు.. కాలనీలో రోడ్డు కావాలని, పార్కు అభివృద్ధి కావాలనీ, డ్రైనేజీ సమస్య ఉందని వినతి పత్రాలు ఇచ్చి పనులు చేయించుకున్న వారు ఎవ్వరూ.. అభ్యర్థుల వెంట నిలబడలేదు. మచ్చబొల్లారం తెరాస అభ్యర్థి రాజ్‌జితేంద్రనాథ్ అధికంగా ప్రజల నుంచి ప్రశ్నలను ఎదుర్కొన్నారు. మచ్చబొల్లారం కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఆయన తన పదవి కాలంలో సుమారు వంద కోట్ల 20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. జిహెచ్‌ఎంసి లెక్కల ప్రకారం అధిక పనులు జరిగిన డివిజన్‌గా పేరు ఉంది. కానీ ఎన్నికల సమయం వచ్చే సరికి ఆయన ఏకాకిగా మిగిలారు. యువకుడైన జితేంద్రనాథ్ బస్తీ ప్రజలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. వెంకటాపురం నుంచి పోటీ చేసిన టి.మోహన్.. పూర్తి స్థాయిలో బస్తీ నివాసి అయినా పనులు చేయలేదనే విమర్షించారు. ఒక్కటి రెండు కుల సంఘాలు తెరాస పార్టీకి ఓట్లు వెస్తామనీ ప్రకటించాయి కానీ కాలనీ సంఘాలు ఎవ్వరూ ప్రకటించలేదు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపైన ముందుకు వచ్చి పార్టీ పరంగా మద్దతు నిస్తామనీ హామీ ఇచ్చారు. అల్వాల్‌లో మాజి సైనికులు ముందుకు వచ్చి రెండు వేరువేరు చోట్ల సమావేశాలు నిర్వహించి తెరాసకి మద్దతునిచ్చారు.