హైదరాబాద్

పాతబస్తీ అభివృద్ధిపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: పాతబస్తీ అభివృద్ధిపై జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డితో ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ బృందం మరోసారి సమీక్ష నిర్వహించారు. తాజాగా శుక్రవారం కమిషనర్‌ను కలిసిన బృందం పలు అభివృద్ధి అంశాలు, పాతబస్తీలో సుదర్ఘీంగా నెలకొన్న సమస్యలపై సుదర్ఘీంగా చర్చించారు. ముఖ్యంగా ట్రాఫిక్, వౌలిక సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చర్చించారు. చార్మినార్ సమీపంలో పాదచారుల కోసం ఏర్పాటు చేస్తున్న పెడస్టేరియన్ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బృందం సూచించింది. ఈ పనులు పూర్తయితే చార్మినార్ పరిసర ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సూచించింది. ఇక్కడ వీధి వ్యాపారులెక్కువై పోవటంతో ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతోందని, వీధి వ్యాపారుల కోసం మూసీ నదిపై ప్రత్యేకంగా ఓ వంతెన నిర్మించి, దాన్ని వీధి వ్యాపారులకు కేటాయించి పునరావాసం కల్పించినట్లయితే ట్రాఫిక్ పరంగా, పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుందని సూచించింది. ఈ వంతెనను నిర్మిస్తే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వీధి వ్యాపారుల వల్ల పెరుగుతున్న సమస్యలు కూడా తగ్గి, వాహన రాకపోకలో వేగవంతమవుతాయని అభిప్రాయపడింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య కొంతవరకైనా తగ్గే అవకాశముందని బృందం సూచించింది. కేవలం వీధి వ్యాపారుల కోసమే ఈ వంతెనను నిర్మించనట్లయితే దీనిపై నైట్ బజార్ కూడా నిర్వహించుకునే వెసులుబాటు కల్గుతోందని వివరించింది. అంతేగాక, ఒకప్పటి చారిత్రక మార్కెట్ అయిన ముర్గీమార్కెట్ వద్దనున్న క్లాక్ టవర్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే చార్మినార్ పరిసర ప్రాంతాలకు మరింత మంచి లుక్ వస్తోందని ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ కమిషనర్‌కు వివరించారు. దీనికి తోడు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌పై వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయని, వాహనాలు వేగంగా వంతెన దిగిన తర్వాత వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్న విషయాన్ని గుర్తించి, బ్రిడ్జిని పొడిగించాలని అక్బరుద్ధీన్ కమిషనర్‌కు సూచించారు. దీంతో పాటు పాతబస్తీలో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు పనులపై కూడా ఈ ఎమ్మెల్యే బృందం సమీక్షించింది. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్ రెడ్డితో పాటు మెట్రో, జిహెచ్‌ఎంసిలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యువకులు ఓటర్లుగా నమోదు
*విద్యార్థులకు జిహెచ్‌ఎంసి
కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచన

హైదరాబాద్, జనవరి 20: ప్రజాస్వామ్యాన్ని మరింత బలపర్చేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని పాలకులను ఎన్నుకునేందుకు ఓటర్లుగా నమోదు కావాలని జిహెచ్‌ఎంసి కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా యువకులు 18 ఏళ్లు దాటగానే ఓటర్లుగా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉలూం ఉన్నత పాఠశాల, బేగంపేట కుందన్‌బాగ్‌లోని చిన్మయ హై స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన యువ ఓటరు చైతన్య కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ ఓటర్ల నమోదు ప్రక్రియ తదితరంశాలపై యువ ఓటర్లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యత, విలువను విద్యార్థులకు వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఓటరుగా నమోదు చేసుకోవటంతో పాటు ఓటు అనేది తమ హక్కు అన్న విషయాన్ని తెల్సుకోవాలన్నారు.
ఆన్ లైన్‌తో పాటు సమీపంలోని సర్కిల్ కార్యాలయాల్లో కూడా యువతీయువకులు ఓటర్లుగా తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, వచ్చే నెల 2వ తేదీ నుంచి మూడురోజుల పాటు నగరంలో జరగనున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరంలోని ప్రతి పౌరుడు 1969 అనే ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి హైదరాబాద్ నగరాన్ని అగ్ర స్థానంలో నిలపేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హరిచందన, అదనపు కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్లు సత్యనారాయణ, సుధాంశ్ తదితరులు పాల్గొన్నారు.