హైదరాబాద్

ట్రాఫిక్ నియమాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో అనేక కుటుంబాలు అవస్థల పాలవుతున్నారని, రోడ్డు ప్రమాదాలతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర ట్రాఫిక్ విభాగం డిసిపి ఎల్‌ఎస్ చౌహాన్ కోరారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గోషామహల్‌లోని ట్రాఫిక్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం జరిగిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాధాలను అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్న వాటిని సక్రమంగా ప్రజలు పాటించినపుడే సత్ఫాలితాలు ఇస్తాయన్నారు. నగరంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ లేకుండా కాప్‌లెస్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే సిసి కెమెరాలో రికార్డు అవుతుందని, వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనాలను నడుపాలని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాదారుల పట్ల ట్రాఫిక్ పోలీసుల తీరు బాగాలేదని పలువురు మహిళలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపిలు ఎ.ముత్యంరెడ్డి, షేక్‌మాసుమ్‌బాషా. ఇన్స్‌పెక్టర్లు సంతోష్‌కిరణ్, జి.హరిష్ పాల్గొన్నారు.
బోడుప్పల్‌లో..
ఉప్పల్: రోడ్డు ప్రమాదాల నివారణ మనందరి బాధ్యత అని మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ కె.జగన్నాధరెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాల నివారణ కోసం శుక్రవారం బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీని ప్రారంభించారు. సమాఖ్య ప్రతినిధులు రాపోలు రాములు, బొమ్మక్ మురళి, రమేశ్, పులకండ్ల జంగారెడ్డి, అశోక్‌రెడ్డి, కనకదుర్గ, సరిత, అనురాధ, సుజాత మురళి, మార్గరేట్, వేలాది మంది విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పల్లవి స్కూల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రమేశ్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉప్పల్ శాంతిభద్రతల పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి ప్రమాదాల నివారణ కోసం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు నర్సింహారెడ్డి, జంగయ్య, ఎస్‌ఐలు రవి, విక్రంరెడ్డి, రవిందర్, కృష్ణ, రామసూర్య పాల్గొన్నారు.
ఆర్టీఏ ఆఫీసులో కంటివైద్య శిబిరం
రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఉప్పల్ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మేడ్చల్ డిటిఓ పుప్పాల శ్రీనివాస్ ప్రారంభించగా ఆర్టీఓ వెంకటేశం, ఎంవిఐలు రవీందర్ కుమార్, సురేష్‌రెడ్డి, ప్రవీందర్‌రాజ్, ఏఓ ప్రసాద్, సిబ్బందితో పాటు వందలాది మంది డ్రైవర్లు పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
తాండూరులో..
తాండూరు: తాండూరు ఆర్టీఎ సబ్ యూనిట్ కార్యాలయంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆర్టీఏ దుర్గాదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దుర్గాదాస్ మాట్టాడుతూ ప్రభుత్వం ప్రజలను ముఖ్యంగా వాహనాల దారులను మరీ ముఖ్యంగా డ్రైవర్‌లు అప్రమత్తంగా ఉండి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన పలు జాగ్రత్తలు సూచనలు ఇస్తూ అవగాసన కల్పిస్తుందని అన్నారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎన్ రెడ్డి పాల్గొన్నారు.
లంగర్‌హౌస్‌లో..
నార్సింగి: రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పశ్చిమ మండల ఆర్టీఓ రమేష్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం లంగర్‌హౌస్ కేంద్రీయ విద్యాలయంతోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత ఎలా పాటించాలని విద్యార్ధులకు అవగాహన సదస్సును నిర్వహించారు. సూపరింటెండెంట్ మహబుబ్ హుస్సేన్, ఎఎంవిఐలు శీతల్‌చౌహాన్, శృతి పాల్గొన్నారు.
చంద్రగిరి కాలనీలో
నేరేడ్‌మెట్: వాహనదారులు, ప్రయాణికులు రోడ్లపై వెళ్లెప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడంవల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నేరేడ్‌మెట్ సిఐ జగదీశ్‌చంద్ర పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా శుక్రవారం చంద్రగిరి కాలనీలోప్రసంగించారు.

స్వచ్ఛతపై
విస్తృత ప్రచారం
ప్రజావగాహన కోసం
200 హోర్డింగ్‌లు
25 లక్షల కరపత్రాలతో
నేటి నుంచి స్వచ్ఛయాత్రలు
200 ప్రాంతాల్లో ‘స్వచ్ఛత’పై వాల్ రైటింగ్‌లు

హైదరాబాద్, జనవరి 20: స్వచ్ఛ్భారత్ మిషన్ దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకును సాధించుకునేందుకు జిహెచ్‌ఎంసి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం మీడియాతో చెప్పారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి మూడురోజుల పాటు నగరంలో స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా పర్యటించనున్న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందాన్ని ఆకట్టుకునేందుకు మరిన్ని వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలోని 150 డివిజన్లలో కార్పొరేటర్ల ద్వారా స్వచ్ఛతపై అవగాహనకార్యక్రమాలను చేపట్టాలని మేయర్ బొంతు రామ్మోహన్ నిర్ణయించారు. అయితే నగరానికి మొదటి అయిదు ర్యాంకుల్లో స్థానం దక్కించుకునేందుకు వీలుగా ప్రజల్లో ఏ రకంగా అవగాహన పెంపొందించగలం? వారు స్వచ్ఛందంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనేలా వారిని చైతన్యవంతులను చేసేందుకు గాను విస్తత్రంగా ప్రచారం చేయాలని మేయర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి అన్ని డివిజన్లలో కార్పొరేటర్లు స్వచ్ఛ యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసికి చెందిన సుమారు 200 హోర్డింగ్‌లను స్వచ్ఛత ప్రచారం కోసం వినియోగించాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యంగా స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ హైదరాబాద్, అలాగే చెత్తను తడి,పొడిగా వేర్వేరు చేయటం, అలా చేస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటికి తోడు బహిరంగ మల,మూత్ర విసర్జనను నివారించేందుకు పౌరుల బాధ్యతను గుర్తుచేస్తూ నినాదాలను కూడా ఈ హోర్డింగ్‌లపై ఏర్పాటు చేసేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమైంది. దీనికి తోడు 150 డివిజన్లలో కార్పొరేటర్లు స్వచ్ఛ పాదయాత్రలు నిర్వహించి స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ ర్యాంకు గురించి ప్రజలను నేరుగా కలిసి వివరిస్తూ, పంపిణీ చేసేందుకు 25 లక్షల కరపత్రాలను ముద్రించాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. వీటితో పాటు స్వచ్ఛత అంశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను సెలబ్రిటీలను కూడా ఈ స్వచ్ఛయాత్రలో భాగస్వాములను చేసేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమవుతోంది. స్వచ్ఛ ర్యాంక్ కోసం జిహెచ్‌ఎంసి గత మూడు,నాలుగు నెలల నుంచి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నా, స్వచ్ఛ అంబాసిడర్లుగా నియమితులైన ప్రముఖులు నేటికీ ఒక్క కార్యక్రమంలో కూడా భాగస్వాములు కాకపోవటం గమనార్హం.