హైదరాబాద్

త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు జలమండలి ఆధ్వర్యంలో ప్రతి నెల మూడో శనివారం ప్రధాన కార్యాలయంలో మీట్ యువర్, డయల్ యువర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మీట్ యువర్ ఎండి, అనంతరం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు డయల్ యువర్ ఎండి కార్యక్రమంను నిర్వహించారు. మీట్, డయల్ యువర్ ఎండి కార్యక్రమానికి ఫిర్యాదులు వెలువెత్తాయి. మల్కాజిగిరి, బేగంబజార్, ఆల్కపురి కాలనీ, హిమయత్‌నగర్, ఇసిఐఎల్, బొల్లారం, వైశాలినగర్, దారుషిఫా, తుకారాంగేట్ ప్రాంతాల నుంచి అరకొరగా నీటి సరఫరా, కలుషిత నీటి సరఫరా, అతి తక్కువగా నీటి సరఫరా, లోప్రెషర్, బిల్లింగ్, మంచినీటి సరఫరా సమయాలకు సంబంధించిన వాటిపై పది ఫిర్యాదులు డయల్ యువర్ ఎండి కార్యక్రమానికి అందాయి. వినియోగదారులిచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే అందుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి, నివేదికను ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని సంబంధిత జనరల్ మేనేజర్‌లను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ ఆదేశించారు.
అంతకు ముందు నిర్వహించిన మీట్ యువర్ ఎండి కార్యక్రమంలో దాదాపు 23 ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల సమస్యలు ఎండి దృష్టికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు తీసుకువచ్చారు. వెంటనే ఫిర్యాదులను పరిష్కరించాలని మెయింటనెన్స్ విభాగంకు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్లను ఎండి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండితో పాటు డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ, అజ్మీరాకృష్ణ, మెయింటనెన్స్, రెవెన్యూ, ట్రాన్స్‌మిషన్ విభాగాలకు చెందిన సిజిఎం, జిఎం, డిజిఎం, మేనేజర్లు పాల్గొన్నారు.

జల్లికట్టుకు మద్దతుగా
మానగర్ తమిళ సంఘం రిలే దీక్ష
ముషీరాబాద్, జనవరి 21: తమిళుల ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం ఆంక్షలు విధించవద్దని హైదరాబాద్ మానగర్ తమిళ సంఘం డిమాండ్ చేసింది. తమిళనాడులో ఉద్ధృతంగా జరుగుతున్న నిరసనలకు మద్దతు జరిగిన దీక్షలోనగరంలోని తమిళులు, విద్యార్ధులు, ఉద్యోగులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జల్లికట్టుకు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సాయికాంత్, డా.కృపానందం మాట్లాడుతూ తమిళుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ప్రభుత్వాలు ప్రవర్తించవద్దని అన్నారు. తరతరాలుగా ఆచారంగా వస్తున్న జల్లికట్టుకు అంతరాయాలు సృష్టించి పశుసంపద పరిరక్షణకు విఘాతం కల్పించవద్దని డిమాండ్ చేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం.కె.బోస్, ఆర్‌కె అయ్యర్, ఎస్.రాజ్‌కుమార్, రామలింగం, కమలాకన్నన్, విజయకుమార్, మోహన్, రాజు పాల్గొన్నారు.