హైదరాబాద్

మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే జంటనగర వాసుల చిరకాల స్వప్నమైన మెట్రోరైలు ప్రాజెక్టు పనులు రోజురోజుకీ వేగవంతవమవుతున్నాయి. ఒక వైపు కారిడార్, మెట్రో స్టేషన్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల మెట్రో పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం కోసం చేపట్టిన స్థల సేకరణకు ఎదురైన అడ్డంకులు కూడా క్రమంగా తొలగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం సంగీత్ థియేటర్ సమీపంలో ఓ కాంప్లెక్సులోని కొంత భాగాన్ని కూల్చివేసి, కోట్లాది రూపాయల నష్టపరిహారాన్ని అందించిన హైదరాబాద్ మెట్రోరైలు ఇపుడు కారిడార్ 2లోని ఆర్టీసి క్రాస్‌రోడ్డు-బోయిగూడ స్ట్రెచ్‌లో భాగంగా ముషీరాబాద్‌లో ఇరుకుగా ఉన్న రోడ్డుకు ఆనుకుని ఉన్న వక్ఫ్ బోర్డుకు రూ. కోటి 72లక్షల నష్టపరిహారాన్ని మెట్రోరైలు చెల్లించగా, భవన కూల్చివేత పనులను శనివారం జిహెచ్‌ఎంసి అధికారులు చేపట్టారు. ఈ స్థల సేకరణతో ఆర్టీసి క్రాస్‌రోడ్డు-బోయిగూడ స్ట్రెచ్‌ల మధ్య మూడు పిల్లర్లకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి.
వారానికోసారి టెస్ట్న్స్
మొత్తం మూడు మెట్రో కారిడార్లలో కారిడార్ 1 మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లో ఇప్పటికే మియాపూర్ నుంచి సంజీవరెడ్డినగర్ వరకు పనులు పూర్తి కావటంతో ఈ రూట్‌లో వారంతపు రోజుల్లో మెట్రోరైల్ టెస్ట్న్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో రాకపోకలు సాగిస్తున్న నగర వాసులు ఎంతో ఆసక్తితో మెట్రో పరుగులను తిలకిస్తున్నారు. ఇక మూడు కారిడార్లలో అన్నింటి కన్నా ముందే పరుగులకు సిద్దమైన కారిడార్ 3లోని నాగోల్-శిల్పారామంలో భాగంగా నాగోల్-మెట్టుగూడ వరకు ఇప్పటికే అనేక సార్లు టెస్ట్న్‌న్రు నిర్వహించిన మెట్రోరైలు అధికారులు ఇందుకు రైల్వే భద్రత శాఖ నుంచి అవసరమైన క్లియరెన్స్‌లు కూడా తీసుకుంది. ఈ రూట్‌లోని పలు స్టేషన్లలో ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ యంత్రాలను, ఎస్క్యులేటర్లను భిగించే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.

అక్రమ లేఅవుట్లపై హెచ్‌ఎండిఏ కనె్నర్ర
హద్దురాళ్ల్ల తొలగింపు
ఉప్పల్, జనవరి 21: అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హెచ్‌ఎండిఏ మళ్లీ కనె్నర్ర చేసింది. నగర శివారులోని పలు ప్రాంతాలలో మొత్తం ఏడు అక్రమ లేఅవుట్లలో హద్దురాళ్లను, ప్రహారి గోడ, గేట్లను భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. లేఅవుట్ల నిర్వాహకులు అడ్డువచ్చినా కూల్చివేతలను చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బాలాపూర్‌లోని సర్వే నెంబర్ 79 నుంచి 90, 253 నుంచి 259 వరకు 25 ఎకరాల విస్తీర్ణంలో, తుర్కపల్లిలోని సర్వే నెంబర్ 412, 413లో గల రెండెకరాలు, 4, 14, 41, 54, 73, 475లో గల 12 ఎకరాలలో, 595, 596, 604, 605, 606లో మూడెకరాల ఎనిమిది గుంటలు,అమీన్‌పూర్‌లోని సర్వే నెంబర్ 603లో 5 ఎకరాల ఆరుగుంటలు, 606లో 2ఎకరాల 10గుంటల్లో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు, గేట్లు, ప్రహారి గోడను నేలమట్టం చేశారు.