హైదరాబాద్

ఉత్సాహంగా సైక్లథాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: పర్యావరణం, శరీర ధారుడ్యం, ఆరోగ్యం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని నగరంలో ప్రయాణాల కోసం సైక్లింగ్ చేయడమే ఉత్తమమని హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అన్నారు.
68వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి వద్ద హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ (హెచ్‌బిసి) ఏర్పాటు చేసిన ‘ది గ్రేట్ హైదరాబాద్ సైక్లథాన్-2’ను రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డెరెక్టర్ జనరల్ (విజిలెన్స్) రాజీవ్ త్రివేది జెండాను ఊపి ప్రారంభించారు. రాజీవ్ త్రివేది కూడా కొంత దూరం సైకిల్‌ను నడిపించారు. హైదరాబాద్ బైసైక్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ డివి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ది గ్రేట్ హైదరాబాద్ సైక్లథాన్ 2ను 10 కిమీ మాస్ రైడ్, 30 కిమీ ఫౌండేషన్ రైడ్, 60 కిమీ కంట్రీసైడ్ రైడ్ అనే మూడు కేటగిరీలుగా నిర్వహించారు.
10 కిమీ మాస్ రైడ్‌ను హెచ్‌బిసి బైక్ స్టేషన్ నుంచి ప్రారంభమై కొత్తగూడ టి జంక్షన్ వరకు వెళ్ళి తిరిగి హెచ్‌బిసికి చేరుకున్నది. 60 కిమీ కంట్రీ సైడ్ రైడ్ హెచ్‌బిసి గచ్చిబౌలి బైక్ స్టేషన్ నుంచి ప్రారంభమై కాశీంబౌలి గ్రామం, బాకారం, చేవెళ్ళ రోడ్డు వరకు వెళ్ళి తిరిగి అదే మార్గంలో వెనుకకు చేరుకున్నది. 30 కిమీ ఫౌండేషన్ రైడ్‌ను 60 కిమీ కంట్రీసైడ్ రైడ్‌లోని సగం దూరం వరకు నిర్వహించడం జరిగింది.
నగర ప్రజలు సైక్లింగ్‌కు అలవాటుపడాలన్న ఉద్దేశ్యంతో బైసైక్లింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చైర్మన్ మనోహర్ వివరించారు.

డబుల్ బెడ్‌రూమ్ గృహాలు మాకొద్దు!
రామకృష్ణానగర్
బస్తీవాసుల ఆగ్రహం

ఖైరతాబాద్, జనవరి 22: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని చెబుతుండగా రామకృష్ణానగర్ బస్తీవాసులు మాత్రం తమకు డబుల్ బెడ్‌రూమ్ గృహాలు అవసరం లేదంటున్నారు. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్ బస్తీవాసులు ప్రభుత్వ స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు చేసుకొని జీవిస్తున్నారు. సుమారు 40 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న తమకు స్థలాలు కేటాయించాలని ఏళ్ల తరబడి బస్తీవాసులు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇక్కడి ప్రభుత్వం వారికి పట్టాలను అందజేసింది. అనంతరం జరిగిన పరిణామాలతో అదే ప్రాంతంలో డబుల్ బెడ్‌రూమ్ గృహాలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం బస్తీవాసులకు మొదటి నుంచి ఆగ్రహాన్ని తెప్పిస్తునే ఉంది. ఏళ్ల తరబడి కనీస వసతులకు సైతం దూరంగా ఉండి కష్టనష్టాలకోర్చి పట్టాలు సాధించిన బస్తీవాసులు వారి స్థోమతకు తగ్గట్టు గృహాలను నిర్మించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కొంత మందిని అనర్హులుగా గుర్తించారు. వారంతా తమకు కూడా గృహాలను కేటాయించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం బస్తీలో సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు స్థలాలు ఇచ్చేదిలేదంటూ బీష్మించుకు కూర్చొన్నారు. అధికారులు స్థానికులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అనడంతో చేసేదిలేక వెనుతిరిగారు. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆదివారం బస్తీలో పర్యటించారు. పట్టాలు రాని 40 మంది వివరాలను సేకరించారు. డబుల్ బెడ్‌రూమ్‌లను వ్యతిరేకిస్తూ రూపొందించిన వినతి పత్రాన్ని 140 సంతకాలు చేసి ఎమ్మెల్యేకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికులకు ఇష్టం అయితేనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తామని, ఒప్పుకోని పక్షంలో వారి ఇష్టానుసారంగా నిర్మించుకోవచ్చని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణానికి ఒప్పుకొని వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తామని వస్తున్న వార్తలను నమ్మవద్దని అన్నారు. బస్తీవాసులను భయబ్రాంతులకు గురిచేసే విధంగా సర్వేలు చేపట్టవద్దని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే ఫోన్‌లో వివరించారు. మంగళవారం నిర్వహించతలపెట్టిన సర్వేను కూడా రద్దు చేసుకోవాలని తహశీల్దార్‌కు సూచించారు. ఈ విషయంలో ఉన్నత అధికారులు, మంత్రులతో చర్చిస్తానని, నిశ్చితంగా ఉండాలంటూ స్థానికులకు సూచించారు.