హైదరాబాద్

దూసుకొచ్చిన మృత్యువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న హమాలీని ఆటోరూపంలో మృ త్యువు పొట్టనపెట్టుకుంది. స్థానికులు ఏం జరిగిందో చూసేలోపే బాధితుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాలంటేనే జంకుతున్నారు. శాలిబండ పోలీసుల కథనం ప్రకారం..పహడీషరీఫ్ ప్రాంతంలోని వెంకటాపురానికి చెందిన జంగయ్య (45) శంషీర్‌గంజ్‌లోని బియ్యం షాపులు, రైస్‌మిల్‌లో హమాలీగా పనిచేస్తున్నాడు. జంగయ్య ఆదివారం ఉదయం పదిగంటల 25 నిమిషాల ప్రాంతంలో శంషీర్‌గంజ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఫలక్‌నుమా నుండి అలియాబాద్ వైపు వస్తున్న ఆటో(టిఎస్13యు3145) ఒక్కసారిగా గాలిలోకి పైకి లేచి అతడిని ఢీకొట్టింది. ఆటోముందు చక్రం గాలిలోకి లేచి జంగయ్య ఛాతిపై ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన జంగయ్య అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ప్రమాద తీవ్రతకు ఆటోముందు చక్రం వూడి రోడ్డుపై పడింది. రెప్పపాటు సమయంలో చోటుచేసుకున్న సంఘటనతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించగా అప్పటికేమృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. చాంద్రాయణగుట్ట బార్కాస్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ మెహతాబుద్దీన్‌ను శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ లింగయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆటో డ్రైవర్లు తాగి నడపడంతో పాటు రోడ్లపైనే ఫీట్లు చేస్తుండటం కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, కఠిన చర్యలు తీసుకుంటే స్థానిక నేతలు జోక్యం చేసుకుంటున్నారని పోలీసులు ఆవేదన చెందుతున్నారు.

జూబ్లీహిల్స్‌లో కారు బోల్తా
ఖైరతాబాద్, జనవరి 22: దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు కొనసాగుతున్నా వాహనదారులు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. దీంతో నగర రోడ్లపై ప్రమాదాలు ఆగడం లేదు. జూబ్లీహిల్స్ రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. వివరాల్లోకి వెళితే రోడ్ నెంబర్ 12 సయ్యద్ నగర్‌లో నివాసం ఉండే ఆసిఫ్ (25) సేల్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం కేబీఆర్ పార్క్ వైపునుంచి జూబ్లీహిల్స్ చౌరస్తాకు కారులో వెళుతుండగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న ఆసిఫ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారును మితిమీరిన వేగంతో నడపడం వల్లే బోల్తాకొట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో రోడ్డుపై జనసంచారం తక్కువగా ఉండటంతో పెనుప్రమాదం తప్పినట్టు అయింది. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎగ్జిబిషన్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో
చిన్నారి మృతి

హైదరాబాద్, జనవరి 22: నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులతో వస్తున్న ఓ కుటుంబంలోని చిన్నారిని మృత్యువు కబళించింది. శనివారం రాత్రి ఆబిడ్స్ చర్మాస్ సమీపంలో జరిగిన ఈ ఘటన గురించి ఆబిడ్స్ పోలీస్టేషన్ సబ్ ఇన్‌స్పెపెక్టర్ సైదులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆసిఫ్ తన భార్య, కొడుకు, కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎగ్జిబిషన్‌కు వస్తున్నారు. ఆబిడ్స్ చర్మాస్ సమీపంలోని తాజ్‌మహల్ హోటల్ జంక్షన్ వద్ద వెనుక నుంచి వచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వీరిలో సానాఫాతిమా (10) బస్సు ఎడమ వైపు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వెనుకే ద్విచక్రవాహనం నడుపుతున్న సుధాకర్ సైతం బస్సు కుడిచక్రం కింద పడి గాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఆబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.