హైదరాబాద్

అంకిత భావంతో అధికారులు పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జనవరి 23: ప్రజా సమస్యలను సత్వరంగా న్యాయబద్ధంగా త్వరిత గతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం చేకూర్చాలనే సదాశయంతో ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కలెక్టర్ డి.దివ్య పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాన్ని గుర్తించి ప్రజావాణిలో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అంకిత భావంతో అధికారులు పని చేయాలని అన్నారు. ప్రజావాణిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే అధికారులకు అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. సమస్యల పరిష్కారంలో తాత్సారం ఎందుకు జరుగుతోందని అధికారులను ప్రశ్నించారు. ప్రజావాణిలో తగిన సత్వర న్యాయం చేకూరేలా అధికారుల శ్రద్ధ చూపాలని లేకుంటే చర్యలు తప్పవంటూ అధికారులను మందలించారు. కాగా తాండూరు ప్రజావాణిలో రెవెన్యూ, రేషన్‌కార్డులకు, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. తాండూరు డివిజన్‌లోమైనింగ్ అక్రమాలు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు మైనింగ్ చెందిన అక్రమాలు, భూకబ్జాలు, చట్ట ప్రకారం అరికడతామని వివరించారు. తాండూరు పట్టణ శివారుల్లో ఖాంజాపూర్, పాత తాండూరు ప్రాంతాలలో ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇసుక విక్రయాలు సాగటం లేదన్నారు. ఇసుక అక్రమార్కుల ఆటలు కట్టించే విధంగా కఠిన చర్యలు చేపడుతామని చెప్పారు.