హైదరాబాద్

నేడు జాతీయ ఓటరు దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ఓటు..ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రజలకు అందించిన గొప్ప ఆయుధం. దీని ప్రాధాన్యత, ప్రాముఖ్యతను తెలిజేసేలా నేడు జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అతిధిగా భన్వర్‌లాల్, ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కూడా పాల్గొననున్న ఈ కార్యక్రమంలో ఇటీవలే కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న యువకులకు ఓటరు ఫొటో గుర్తింపు కార్డులను అందజేయనున్నారు. ఓటు, ఓటరుగా నమోదు చేసుకునే విషయంపై 18 ఏళ్లు దాటిన ప్రతి యువతీయువకుల్లో అవగాహనను పెంపొందించేందుకు గాను జిహెచ్‌ఎంసి ఇటీవలే వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులకు వేర్వేరుగా నిర్వహించిన ఈ పోటీలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల నుంచి హాజరైన విద్యార్థులకు చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో పోటీలను నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి వచ్చిన విద్యార్థులకు బంజారాహిల్స్‌లోని బల్దియాకు చెందిన సిటీ మేనేజర్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్)లో పోటీలు నిర్వహించారు. బుధవారం రవీంద్రభారితిలో జరగనున్న జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ పోటీల్లో విజేతలుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయనున్నట్ల అధికారులు తెలిపారు.
హైదరాబాద్ పోలీస్‌కు ఎక్సెలెన్స్ అవార్డు

హైదరాబాద్, జనవరి 24: హైదరాబాద్ పోలీస్ రూపొందించిన హైద్-కాప్ మోబైల్ అప్లికేషన్‌ను జాతీయ అవార్డు లభించింది. మంగళవారం కొయంబత్తూర్‌లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్‌ఐ) 51వ, వార్షిక సదస్సులో ఈ అవార్డును నగర పోలీస్‌కు అందజేశారు. కేంద్ర విద్యుత్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదనపు కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్ చేతుల మీదుగా నగర పోలీస్ తరఫున ఈస్ట్‌జోన్ డిసిపి డాక్టర్ రవీందర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌లు, అందుకున్న అవార్డుల పట్ల డిజిపి అనురాగ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు.