హైదరాబాద్

స్వైన్‌ఫ్లూ గడగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో నగర వాసులు భయంతో గడగడలాడుతున్నారు. అనధికార సమాచారం ప్రకారం గాంధీ ఆసుపత్రిలోనే ఇప్పటి వరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయతే వేరే అనారోగ్య కారణాల వల్ల మరణించి ఉంటారని దీనిపై ఆందోళన అవసరం లేదని అధికారులు, వైద్యులు అంటున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 23వ తేదీ వరకు 3210 మంది రక్త నమూనాలు తీసుకుని పరిశీలించగా, 176 పాజిటివ్‌గా ఉన్నదని, వీరిలో 10 మంది ఇతర అనారోగ్య కారణాల వల్ల మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. ఈ నెల 23న 46 మందిని పరీక్షించగా, ఏడుగురికి పాజిటివ్‌గా గుర్తించడం జరిగిందని, వారికి చికిత్స అందిస్తున్నామని, ఎవరూ మరణించలేదని పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, అవసరమైనన్ని మందులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వచ్చినట్లు సూచనలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలని సూచించారు.

సిద్దిఅంబర్ బజార్‌లో
ఫుట్‌పాత్‌ల ఆక్రమణ
106 దుకాణాలకు నోటీసులు

హైదరాబాద్, జనవరి 24: నగరంలోని, సిద్దిఅంబర్ బజార్‌లో 106 దుకాణాల యజమానులకు హైదరాబాద్ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తమ దుకాణాల ముందు ఆక్రమించిన ఫుట్‌పాత్‌లను వెంటనే ఖాళీ చేస్తామని లోగడ కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని డివిజన్ బెంచ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణతో కూడిన బెంచ్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 22న ఆ దుకాణాల యజమానులు ఫుట్‌పాత్‌ల ఆక్రమణ నుంచి తప్పుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చినా, ఇంత వరకు ఆచరణలో చూపలేదని, ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని దాఖలైన పిటీషన్‌ను బెంచ్ విచారణకు స్వీకరించి పై విధంగా నిర్ణయం తీసుకున్నది. కోర్టులంటే ఆ దుకాణాల యజమానులకు గౌరవం లేదని, కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడే వారు దారికి వస్తారని బెంచ్ వ్యాఖ్యానించింది. బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.