హైదరాబాద్

గ్రేటర్‌లో స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ, ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ఫ్రాన్స్ సహకారంతో ప్రయోగాత్మకంగా ఆర్టీసి స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం పైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు, ఫ్రాన్స్ కాన్సులేట్ జీన్ మార్క్స్, లూమీఫ్లాన్, ఇక్సి కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలవో ప్రజలు, ఆర్టీసి ప్రయాణికులు ఎదుర్కొంట్ను ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 20 కోట్ల నిధులను ఇచ్చేందుకు గత నవంబర్‌లో సంస్థతో కుదిరిన ఎంవోయూ అమలు నగరవాసులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని మంత్రి మహీందర్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఐటి రంగ నిపుణుల మేళవింపుతో గ్రేటర్‌లోని సిటీ బస్సులలో వాహన సమాచారం వివరించే ట్రాకింగ్ విధానం తొలి దశలో 40 బస్సులకు ఏర్పాటు చేస్తామన్నారు. సోలార్ విద్యుత్ విధానంతో నడిచే డిస్‌ప్లేలను నగరంలోని కోఠి, మెహిదీపట్నం వంటి బస్టాండ్లలో ఏర్పాటు చేసి ప్రయాణికులకు, బస్సు సర్వీసుల రాకపోకల ఖచ్చితమైన సమాచారం అందించనున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమవుతుందని ఆశిస్తూ దీని పనితీరు మీద భవిష్యత్ విధానాలు ఆధారపడుతాయన్నారు. ఆర్టీసికి చెందిన ఐదుగురు అధికారులు, సిబ్బంది ఈ విధానాన్ని పర్యవేక్షిస్తారని మంత్రి వివరించారు. ఫ్రాన్స్ అభివృద్ధి ఏజెన్సీ ద్వారా సదరు నిధులు అందుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధికి సీఎం కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రవాణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ, ఐటీ సేవల వినియోగం, ఫ్రాన్స్ సహకారం ఆర్టీసికి, గ్రేటర్ ప్రజలకు ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు.
హైదరాబాద్‌లో ట్రామ్ వే..
జంట నగరాల్లో ‘ట్రామ్-వే’ ఏర్పాటు చేసేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. బుధవారం సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ అధ్వర్యంలో ఫ్రెంచి ప్రతినిధి బృందం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌తో సమావేశమయ్యారు. నగరంలో ట్రామ్-వే ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫ్రెంచ్ ప్రతినిధులు తెలిపారు. దీని ద్వారా కాలుష్యం తగ్గుతుందని, సహజ వనరులను కాపాడుకోవచ్చని, తక్కువ స్థలంలో ట్రామ్-వేను ఏర్పాటు చేసుకోవచ్చని వారు తెలిపారు. ప్రజా రవాణా రంగంలో ఫ్రెంచి టెక్నాలజీ విశ్వసనీయత కలిగిందని వారు సిఎస్‌కు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ మాట్లాడుతూ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుదలకు ప్రైవేటు రంగంతో కలిసి పని చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయని, 400 సంవత్సరాలకుపైగా చరిత్ర హైదరాబాద్‌కు ఉందని అన్నారు. పర్యాటక ప్రాంతాలు కవర్ అయ్యేలా రవాణా వ్యవస్థ ప్రాజెక్టును రూపొందించాలని ఆయన సూచించారు. నగరంలో రోడ్లు వెడల్పుగా ఉన్నాయని, మెట్రో రైలు నిర్మాణం జరుగుతున్నదని, రవాణా ప్రాజెక్టులపై పైలట్ పద్ధతిలో ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించాలన్నారు. ఫ్రెంచి ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావుతో చర్చిస్తామని ఆయన వారికి తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రాంమోహన్‌తో పాటు టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, టిఎస్‌ఆర్‌టిసి ఎండి రమణారావు, బోర్డెక్స్ మెటోపోల్ మెట్రోపాలిటన్ కౌన్సిలర్ మైఖేల్ వెర్నిజోల్, అల్‌ఫ్రైడ్ పీటర్, మార్క్ బరానీ తదితరులు పాల్గొన్నారు.