హైదరాబాద్

భవన నిర్మాణ అనుమతులపై ‘నోట్ల రద్దు’ ప్రభావం నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: నల్లధనాన్ని వెలికితీసేందుకు, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం బల్దియా భవన నిర్మాణ అనుమతుల జారీపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైగా గత ఆర్థిక సంవత్సరాలతో పోల్చితే పది నుంచి ఇరవై శాతం వరకు ఆదాయం ఎక్కువగానే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు నిర్మాణాలు చేపట్టేందుకు కోట్లాది రూపాయలను చెల్లించి జిహెచ్‌ఎంసి నుంచి అనుమతులు తీసుకుంటున్నాయి. వాస్తవానికి కూడా గత నవంబర్ 8వ తేదీన వెయ్యి, 500నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులు బాగా తగ్గి, టౌన్‌ప్లానింగ్‌కు ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవచ్చునని అధికారులు భావించినా, ఆ అంచనా తారుమారైంది. నగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్సులు, పేరుగాంచిన కంపెనీల క్యాంపస్‌లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు నిర్మాణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో కోట్లాది రూపాయలను చెల్లించి అనుమతులు తీసుకున్నాయి. 31 భారీ ప్రాజెక్టుల నిర్మాణ అనుమతుల జారీతోనే గ్రేటర్‌కు రూ. 103 కోట్ల ఆదాయం సమకూరిందని టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం టౌన్‌ప్లానింగ్ విభాగానికి నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల మధ్య ఆదాయ వస్తుందని భావించగా, ఇప్పటి వరకు రూ. 325 కోట్ల వరకు వచ్చినట్లు, గతంతో పోల్చితే రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఆదాయం పెరిగిందని చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో రోడ్లు, ట్రాఫిక్ వంటి అంశాలను పక్కనబెడితే వౌలిక వసతుల పరంగా, ప్రకృతి వైపరీత్యాల్లేని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్లే బడా కంపెనీలు భారీ ప్రాజెక్టులను నిర్మించేందుకు ముందుకొస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోకి రాని గండిపేట ప్రాంతంలో విల్లాల నిర్మాణం చేపట్టిన ఓ సంస్థ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సుమారు రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల విలువ చేసే విల్లాలు పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మాత్రం లేకుండా నవంబర్ 8 తర్వాతి నుంచి నేటి వరకు దాదాపు నాలుగు వందల నుంచి 500 వరకు విల్లాల బుక్ అయ్యాయంటే ‘రద్దు’ ప్రభావం ఏ మాత్రం ఉందో అంచనా వేసుకోవచ్చు.
జూబ్లీహిల్స్‌లో దనిష్ట ఫామ్స్ ఓ భారీ నిర్మాణం కోసం అనుమతి తీసుకుంది. అలాగే నల్లగండ్లలో అపర్ణ కన్‌స్ట్రక్షన్, రాంకీ ఎస్టేట్స్, గచ్చిబౌలీలో రెసిడెన్షియల్ కాంప్లెక్సు, అలాగే తెలంగాణ ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(తెరి) గోపన్‌పల్లిలో భారీ భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐకె బిల్డింగ్ (ఎక్కువ ఎత్తు), అలాగే 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో బయోడైవర్శిటీ పార్కు వద్ధ ఐటి ఆఫీసు ఫేజ్, అలాగే పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మితమయ్యే రెండు బడా ఆసుపత్రి భవనాలు, 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నానక్‌రాంగూడలో ఐటెల్ సంస్థ రెండు కమర్షియల్ భవనాల నిర్మాణాలకు జిహెచ్‌ఎంసి అనుమతులిచ్చింది. దీంతో పాటు ఎల్బీనగర్‌లో ఇప్పటికే ఓ మల్టీప్లెక్సు నిర్మాణంలో ఉండగా, అదనంగా మరో దానికి అనుమతిచ్చారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి జారీ చేసిన అనుమతుల ప్రకారం లక్షలాది అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు, క్యాంపస్‌లు వంటివి ఏర్పాటు కానున్నాయి. ఇందులో ప్రతి వంద అడుగుల విస్తీర్ణం ఆఫీసుకు ఒక ఉద్యోగిని నియమించుకోవాల్సి ఉంటుందని, ఈ రకంగా చూస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. అలాగే ప్రతి చదరపు అడుగు రెసిడెన్షియల్ నిర్మాణానికి జిహెచ్‌ఎంసి రూ.2 వసూలు చేస్తుండగా, కమర్షియల్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్‌కు కొంత ఎక్కువ నిర్మాణ ఛార్జీలను వసూలు చేస్తోంది.
డిజిటల్ ఇంటి నెంబర్లు
ముగిసిన ప్రీ బిడ్ సమావేశం
మొదలైన టెండర్ల ప్రక్రియ

హైదరాబాద్, నవంబర్ 27: నగరానికి మొదటి సారిగా వచ్చిన వారు గానీ, నగరంలోనే నివాసముంటూ ఇతర ప్రాంతాలకు అరుదుగా వెళ్లే వారు ఎవరి చిరునామాను తెల్సుకోవాలంటే నానా తంటాలు పడాల్సిందే! పైగా ఒకే ఇంటి నెంబర్‌పై ఆబ్లిక్ నెంబర్లుండటంతో ఈ ఇళ్లు ఎవరికి చెందినదో కూడా తెలుసుకోవటం ఆషామాషి కాదనే చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులకు శాశ్వత ప్రాతిపదికన చెక్ పెట్టాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. ఇందుకు గాను ప్రతి ఇంటికి ఎనిమిది నెంబర్లతో కూడిన డిజిటల్ ఇంటి నెంబర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించిన జిహెచ్‌ఎంసి టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టింది. వచ్చే నెల 10వ తేదీ వరకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత దశల వారీగా వివిధ ప్రాంతాల్లో ఈ డిజిటల్ ఇంటి నెంబర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే దోమల్‌గూడ ప్రాంతంలో ఓ సంస్థ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ డిజిటల్ నెంబర్లు విజయవంతం కావటంతో ఇక ప్రతి ఇంటికి ఇలాంటి నెంబర్లను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇపుడున్న నెంబర్ల ప్రకారం ఏదైనా అడ్రసు తెల్సుకోవాలంటే ఆ ప్రాంతానికి వెళ్లి ఇంటి నెంబర్‌ను వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఎనిమిది అంకెల డిజిటల్ ఇంటి నెంబర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎనిమిది అంకెల ఇంటి నెంబర్‌ను క్లిక్ ఆన్‌లైన్‌లు అప్లై చేస్తే ఆ ఇళ్లు ఉన్న ప్రాంతం, ఆ భవనం కమర్షియలా? రెసిడెన్షియలా? ఎన్ని అంతస్తుల నిర్మాణం, ఆస్తిపన్ను చెల్లిస్తున్నారా? లేదా? కరెంటు, వాటర్ బిల్లుల వివరాలతో పాటు అందులో నివాసముంటున్న వారి వివరాలను కూడా ఇట్టే తెల్సుకునే వెసులుబాటు కల్గుతోంది. ప్రస్తుతం నగరంలో 20లక్షల వరకు గృహాలున్నట్లు అధికారుల అంఛనాలుండగా, జిహెచ్‌ఎంసి ఎందో ముందుచూపుతో దాదాపు పది కోట్ల ఇళ్లకు ఇలాంటి నెంబర్లను కేటాయించేందుకు వీలుగా ఎనిమిది అంకెలను ఎంచుకుంది. అంతేగాక, వీటికి ముందు ఆంగ్ల పదాలను కూడా చేర్చి ఆ వీధి పేరు, ప్రాంతం వచ్చేలా ఈ అంకెలను నిర్ణయించనున్నారు.
తెలుసుకోవటం చాలా తేలిక?
ముందు ఆంగ్ల పదాలొచ్చి, ఆ తర్వాత ఎనిమిది అంకెలతో వచ్చే ఈ డిజిటల్ ఇంటి నెంబర్‌లో భాగంగా పదాల తర్వాత అయిదు అంకెలుండి, ఆ తర్వాత చివరి మూడు అంకెలు సున్నాలుగా ఉంటే, ఆ ఇళ్లు వ్యక్తిగత నివాసంగా గుర్తించవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ అదే ఇళ్లు ముక్కలుగా విభజింనట్లయితే ఒక్కో సున్నా తొలగి అంకెను పొందుపరుస్తారని ఉదాహరణకు చివరి సున్నాలో రెండు మాత్రమే ఉండి, ఆ తర్వాత ఒకటి అంకె ఉంటే వ్యక్తిగత నివాసంతో పాటు పార్టీషన్ చేసిన మరో ఇళ్లుందన్న విషయం స్పష్టమవుతోందని అధికారులు తెలిపారు. దీనికి తోడు ఏమైనా ప్రమాదాలు సంభవించినపుడు తక్షణమే సహాయక చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గించేందుకు వీలుగా ఈ నెంబర్ల ద్వారా అడ్రస్ తెల్సుకునే అవకాశముంటుందని అధికారులు తెలిపారు.